తెలుగులో అందాల చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) టాప్ హీరోయిన్. తెలుగేంటి? తమిళంలోనూ ఆమెకు బోల్డంత ఫాలోయింగ్ వుంది. సక్సెస్, ఫెయిల్యూర్‌కి అతీతంగా కాజల్ అగర్వాల్ (Kajal Agarwal Hot Item Song) కెరీర్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. అదీ ఈ అందాల చందమామ స్టామినా.
‘కాజల్ (Kajal Aggarwal) పనైపోయింది..’ అనే కామెంట్స్ ప్రతిసారీ రావడం, ఆ తర్వాత ఆమె అనూహ్యంగా సక్సెస్‌లు అందుకుని, కెరీర్ స్పాన్‌ని పెంచుకోవడం మామూలే.
ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ (Kajal) ఐటమ్ సాంగ్స్ చేయడానికీ వెనుకంజ వేయడంలేదు. ఆల్రెడీ ఈ బ్యూటీ ‘జనతా గ్యారేజ్’ కోసం ఐటమ్ బాంబ్‌లా మారింది. ఆ బాంబు మామూలగా కాదు, ఓ రేంజ్‌లో పేలిన విషయం విదితమే.
కేవలం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ‘జనతా గ్యారేజ్’ సినిమాలో కాజల్ అగర్వాల్ చేసిన ‘పక్కా లోకల్’ (Kajal Agarwal Hot Item Song) ఐటమ్ సాంగ్‌కి అప్పట్లో చాలా పెద్ద పేరు వచ్చింది. మళ్ళీ ఇంకోసారి, కాజల్ అగర్వాల్ ఐటమ్ సాంగ్ చేయబోతోందట. ఈసారి అల్లు అర్జున్ కోసమని సమాచారమ్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో (Stylish Star Allu Arjun) కాజల్ అగర్వాల్‌కి (Kajal Agarwal) మంచి స్నేహం వుంది. ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు కూడా. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్య-2’ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అంతేనా, అల్లు అర్జున్ కోసమే ‘ఎవడు’ సినిమాలో అతిథి పాత్ర చేసింది. అందులో అల్లు అర్జున్, కాజల్.. ఇద్దరూ అతిథి పాత్రల్లో కన్పించారు.
బన్నీ కోసం వస్తోన్న కాజల్.. (Kajal Agarwal Hot Item Song)
తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో నటిస్తోన్న అల్లు అర్జున్ (Bunny), ఈ సినిమా కోసమే స్పెషల్ సాంగ్ చేయమని కాజల్ అగర్వాల్‌కి రిక్వెస్ట్ చేశాడంటూ ఓ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. అదెంత నిజమో తెలియదుగానీ, కాజల్ అంటూ ఐటమ్ సాంగ్ చేస్తే, దానికి వచ్చే కిక్కే వేరప్పా.
ప్రస్తుతం కాజల్ తెలుగులో శర్వానంద్ (Sharwanand)సరసన ‘రణరంగం’ (Ranarangam) సినిమాలో నటిస్తోంది. ఇది కాక తమిళంలో ‘కోమలి’ (Comali) అనే సినిమా చేస్తోంది. బాలీవుడ్ ‘క్వీన్’ (Queen Kangana Ranaut)కి తమిళ రీమేక్ అయిన ‘ప్యారిస్ ప్యారిస్’ (Paris Paris) సినిమాలోనూ కాజల్ నటించింది. ఆ సినిమా విడుదల కావాల్సి వుంది.
ఇంకోపక్క బాలీవుడ్ (Bollywood) నుంచీ కాజల్‌కి మంచి మంచి ఆఫర్లు వస్తూనే వున్నాయి. ఇంత బిజీలో కాజల్ (Kajal Agarwal), స్పెషల్ సాంగ్ చేస్తుందా? అనే అనుమానాలున్నాయి కొందరికి.
అదే సమయంలో, ఎందుకు చెయ్యదూ, కాజల్ ఐటమ్ సాంగ్ (Kajal Agarwal Item Song) అంటూ చేస్తే, ఆమెకు హీరోయిన్‌గా నటించినంత రెమ్యునరేషన్ కాకపోయినా, ఆ స్థాయిలో ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు రెడీగా వున్నారని అనేవారూ లేకపోలేదు.. ఆమె ఐటమ్ సాంగ్ చేయబోయే రచ్చ ఆ రేంజ్ లో వుంటుంది కదా.. తప్పదు మరి.
అల్లు అర్జున్ – పూజా హెగ్దే రెండోస్సారి..
అన్నట్టు, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ (Allu Arjun – Trivikram Srinivas) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా #AA19 కోసం ‘అలకనంద’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. ఈ సినిమా కోసం పూజా హెగ్దేని (Pooja Hegde) హీరోయిన్‌గా ఆల్రెడీ ఎంపిక చేసేశారు.
మరో ముఖ్యమైన పాత్ర కోసం ‘మెంటల్ మదిలో’, ‘చిత్రలహరి’ చిత్రాల ఫేమ్ నివేదా పేతురాజ్‌ని (Nivetha Pethuraj) ఇటీవలే ఎంపిక చేశారు. అక్కినేని కాంపౌండ్ నుంచి సుశాంత్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర చేసేందుకు ముందుకొచ్చాడు.
అల్లు అరవింద్, చినబాబు (రాధాకృష్ణ) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమా నిర్మాణం చేపడ్తోన్న సంగతి తెల్సిందే.