అందాల చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal Wedding) పెళ్లి చేసుకోబోతోందట. అబ్బే ఇలాంటి గాసిప్స్ చాలానే వినేశాం. కొంచెం కొత్తగా చెప్పండి అంటారా.? అవునులెండి, ఇంతవరకూ కాజల్ పెళ్లిపై చాలా గాసిప్స్ విన్నాం. కాజల్ నిశ్చితార్ధం కూడా అయ్యిందట అంటూ అప్పట్లో మన సోషల్ కోడి తెగ కూసేసింది కూడాను.
నవంబర్‌లో కానీ, డిశంబర్‌లో కానీ, కాజల్ పెళ్లి చేసుకోవాలనుకుందట కానీ, ఆ తర్వాత వచ్చినా కరోనా సీజన్ కాజల్ పెళ్లిని వాయిదా వేసేసిందట.. అనే గాలి వార్తలు కూడా వినేశాం. సర్లెండి ఆ గాలి వార్తలు పక్కన పెడితే, లేటెస్ట్‌గా కాజల్ అగర్వాల్ పెళ్లి వార్త ఇంకాస్త లేటెస్ట్‌గా హల్‌చల్ చేస్తోంది.
ఈ సారి వరుడి పేరు కూడా బయటికి వచ్చేసింది. ఇంటీరియర్ డిజైనర్, బిజినెస్ మేన్ అయిన గౌతమ్ కిచ్లును కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతోందట. త్వరలోనే అధికారికంగా తన పెళ్లి వార్తను ప్రకటించనుందట. అతి త్వరలోనే ముంబయ్‌లో వీరి వివాహం ఘనంగా జరగనుందట.
మరి ఈ సారైనా ఈ టాక్ నిజమవుతుందా.? కాజల్ అగర్వాల్ నిజంగానే ఓ ఇంటిదవుతుందా.? అంటే లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులున్నాయి.
విశ్వనటుడు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ చిత్రంలో కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు మెగాస్టార్ 152వ చిత్రం ‘ఆచార్య’లోనూ కాజల్ అగర్వాల్ హీరోయిన్. వీటితో పాటు, మరికొన్ని ప్రాజెక్టులు కాజల్ అగర్వాల్ కంప్లీట్ చేయాల్సి ఉంది.
కరోనా కారణంగా ఈ ప్రాజెక్టులన్నీ, ఆగిపోయాయి. పెళ్లి విషయంలో లేటెస్ట్ అప్‌డేట్ నిజమే అయితే, ఈ గ్యాప్‌లోనే కాజల్ పెళ్లి చేసుకుంటుందా.? లేక, కమిట్ అయిన ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేస్తుందా.?