వెండితెరపై అందాల చందమామ కాజల్ అగర్వాల్ చాలా సినిమాలు చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ, (Kajal Aggarwal About Challenging Roles) నటిగా తనను ఛాలెంజ్ చేసే పాత్ర కోసం ఇన్నాళ్ళు ఎదురుచూడగా, ఇప్పుడు మాత్రమే ఆ ఛాన్స్ దొరికిందని అంటోంది.
అయితే, కాజల్ అంతలా ఎదురు చూసిన పాత్ర ఆమెకు వెండితెరపై దొరకలేదు.. ఓటీటీలో త్వరలో విడుదల కానున్న ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్ ద్వారా కాజల్ తాను కోరుకున్న అవకాశాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది.
నటిగా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన అటెంప్ట్‌గా ఈ ‘లైవ్ టెలికాస్ట్’ వెబ్ సిరీస్ గురించి చెప్పింది కాజల్ అగర్వాల్. ఇదొక థ్రిల్లింగ్ వెబ్ సిరీస్. ప్రేక్షకుల్ని భయపెట్టడంలో కూడా కొత్తదనంతో కూడినదై ఈ వెబ్ సిరీస్ వుంటుందట.
కాజల్ మాత్రమే కాదు, చాలామంది నటీనటులు సినిమాలతోపాటుగా వెబ్ సిరీస్‌ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ పుణ్యమా అని వెబ్ సిరీస్‌ల జోరు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా కామెడీ, థ్రిల్లర్, రొమాన్స్ కేటగిరీలోనే వెబ్ సిరీస్‌లు రూపొందుతున్నాయి.
వీటిల్లో మళ్ళీ రొమాంటిక్ వెబ్ సిరీస్‌లకు విపరీతమైన క్రేజ్ వుంటోంది. వెబ్ సిరీస్‌ల ట్రెండ్ గురించి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, మార్పు మంచిదే కదా.. అని అభిప్రాయ పడింది.
సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం కాజల్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) సరసన ‘ఆచార్య’ సినిమా చేస్తోంది. ఆమె నటించిన మరో తెలుగు సినిమా ‘మోసగాళ్ళు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇవి కాక మరో రెండు మూడు సినిమాలున్నాయి తెలుగులో కాజల్ అగర్వాల్‌కి (Kajal Aggarwal About Challenging Roles).
తమిళంలో మూడు, బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తోన్న ఈ అందాల చందమామ ఇటీవలే కరోనా లాక్ డౌన్ సమయంలో గౌతమ్ కిచ్లుని పెళ్ళాడిన సంగతి తెల్సిందే. చాలాకాలం ఈ ఇద్దరి మధ్యా స్నేహం నడిచినా, ఎక్కడా తమ స్నేహానికి సంబంధించిన ఫొటోలు లీక్ కాకుండా జాగ్రత పడింది కాజల్ అగర్వాల్.