Pooja Hegde Kajal Aggarwal.. మధ్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. కానీ, వాటి మీద పన్నులు ప్రభుత్వ ఖజానాకి చాలా అవసరం. అందుకే, పొగాకు ప్రాణాలు తీస్తున్నా, మధ్యం మనుషుల్ని మింగేస్తున్నా వాటి మీద నిషేధం ఉండదు. తాగండి.. తాగి ఊగండి.. ఖజానా నింపండి.. అన్నదే ప్రభుత్వాల అనధికార స్లోగన్.
సాధారణంగా మధ్యం, పొగాకు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేందుకు సెలబ్రిటీలు సుముఖత వ్యక్తం చేయరు. సినిమాల్లో కూడా మధ్యం తాగే సన్నివేశాలప్పుడు హెచ్చరిక సబ్ టైటిల్ వేస్తుంటారు. స్మోకింగ్ విషయంలోనూ అంతే.
కైపెక్కిస్తోన్న Pooja Hegde, Kajal Agarwal
కానీ, ట్రెండ్ మారింది. మధ్యం బ్రాండ్లకు సెలబ్రిటీలు ప్రాచుర్యం కలిపిస్తున్నారు. బ్రాండ్ ప్రమోషన్ పేరుతో సోషల్ మీడియాలో ఆయా మధ్యం బ్రాండ్లకు ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్నారు. అందాల చందమామ కాజల్ అగర్వాల్, బుట్టబొమ్మ పూజా హెగ్దే ఈ లిస్టులో ఉన్నారు.

ఇదేం నైతికత.? సమాజం పట్ల కనీస బాధ్యత లేదా.? అంటూ నెటిజన్లు కాజల్ అగర్వాల్‌నీ (Kajal Agarwal) అలాగే పూజా హెగ్దేనీ (Pooja Hegde) తిట్టి పోస్తున్నారు. కాజల్ కావచ్చు, పూజా హెగ్దే కావచ్చు.. సినీ రంగంలో బోలెడంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. డబ్బుకీ కొదవ లేదు. మరెందుకీ కక్కుర్తి.?
డబ్బెవరికి చేదు.?
అయినా, సెలబ్రిటీలు ఆయా ప్రొడక్టులకు స్రచార కర్తలుగా పని చేయడం కొత్తేమీ కాదు. వాళ్లు చెప్పారనీ ఆయా ప్రొడక్టులను అందరూ వాడేస్తారా.? అంటే అది వేరే చర్చ. సేవా కార్యక్రమాలు చెయ్యండహో.. అని సెలబ్రిటీలు చెబితే.. అభిమానులు దాన ధర్మాలు చేసేయరు. కానీ, చెడు విషయంలో అలా కాదు. అది వేగంగా పాకేస్తుంది.. అనేది కొందరి వాదన.
Also Read: Nivetha Pethuraj: ది రియల్ ఫైటర్.. ఎందుకంటే.!
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. గ్లామర్ ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. నైతికత.. వంకాయ్ ఏమీ లేవిక్కడ.