Kajol Devgn Retirement.. సీనియర్ బాలీవుడ్ నటి కాజోల్ కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పేయనుందట. తాజాగా ఈ విషయాన్ని కాజోల్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలియపరిచింది.
‘జీవితంలో అతి కష్టమైన పరీక్షను ఎదుర్కొంటున్నాను..’ అని పోస్ట్ చేసి ఈ విషయాన్ని తెలిపింది కాజోల్. కాజోల్ అంటే ఒకప్పుడు యూత్ సెన్సేషన్.
ఆమెకు నార్త్‌లోనే కాదు, సౌత్‌లోనూ బోలెడంత మంది అభిమానులున్నారు. ఫ్యామిలీ రోల్స్ చేసినా, గ్లామర్ రోల్స్ చేసినా తనదైన గుర్తింపు వుండేలా చూసుకునేది కాజోల్.
కాజోల్‌కి అసలేమంది.?
ఈ మధ్య సౌత్ సినిమాల్లో స్సెషల్ రోల్స్‌తో ఆకట్టుకుంటోంది కాజోల్. అలాగే ఇటీవల తెలుగులోనూ ఆమె పేరు ప్రస్థావనకొస్తోంది కొన్ని ప్రత్యేకమైన పాత్రల కోసం.
ఈ లోపు ఆమె గురించి ఓ తాజా గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఆమెకి నయం కాని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వున్నాయనేదే ఆ గాసిప్.

అందుకు తగ్గట్లుగానే ఆమె లేటెస్ట్ మెసేజ్ కూడా వుండడంతో అయ్యో పాపం.! కాజోల్‌కి ఏమైంది.? అంటూ ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు.
Kajol Devgn Retirement.. ఆ వెబ్ సిరీస్‌ని ప్రమోట్ చేసేందుకునేనా.? ?
అయితే, అలాంటిదేం లేదనీ, ఇదంతా పబ్లిసిటీ కోసమే కాజోల్ చేస్తోందనీ కొందరంటున్నారు. లేటెస్ట్‌గా కాజోల్ ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.
త్వరలో ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ర్టీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే కాజోల్ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందనీ అంటున్నారు.
కాదు, కాదు ఆమెకి హెల్త్ ఇష్యూస్ వున్నాయని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే, హెల్త్ అప్‌డేట్ ఇచ్చేదే కదా..!
Also Read: చిరు లీక్స్.! నువ్వు ‘భోళా శంకరుడి’వే బాస్.!
సెలబ్రిటీల సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని వేరే వాళ్లు మేనేజ్ చేస్తుంటారు. అలా, కాజోల్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పొరపాటుగా వచ్చిన మేసేజా.. ఇది.!
నిజంగానే కాజోల్ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందా.? అసలేం జరిగి వుండొచ్చు.! తెలియాల్సి వుంది.