Kalatapasvi Viswanath Balakrishna.. కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇక లేరన్న వార్త సగటు సినీ అభిమానిని తీవ్రంగా కలచి వేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, రాజమౌళి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీయార్ రామ్ చరణ్.. ఇలా ఒకరేంటి.? మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్రభాంతికి గురయ్యారు.
బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ కూడా విశ్వనాథ్‌ని గురువుగా భావించే ఎందరో సినీ ప్రముఖులున్నారు.. వాళ్ళంతా విశ్వనాథ్ మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు.
బాలయ్యతోనూ సినిమా చేసిన విశ్వనాథ్..
విశ్వనాథ్ సినిమాలనగానే, ఓ శంకరాభరణం.. ఓ సాగర సంగమం.. ఇలా అత్యద్భుతమైన సినిమాలు గుర్తుకొస్తాయ్. అంతేనా.? ఆయన కెరీర్‌లో కొన్ని డిజాస్టర్ సినిమాలూ వున్నాయి.
నందమూరి బాలకృష్ణ హీరోగా విశ్వనాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిందని ఎంతమందికి తెలుసు.? ఆ సినిమా పేరు ‘జననీ జన్మభూమి’.
కానీ, ‘జననీ జన్మభూమి’ పెద్ద డిజాస్టర్. అసలు ఆ సినిమా వచ్చిందన్న సంగతే చాలామందికి తెలియదు. సుమలత ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
Kalatapasvi Viswanath Balakrishna.. అద్భుతాలూ.. పరాజయాలూ..
చిరంజీవితో ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’ చిత్రాలు తెరకెక్కించారు విశ్వనాథ్. అవి సూపర్ హిట్స్. మరో సినిమా కూడా వుంది చిరంజీవి – కె.విశ్వనాథ్ కాంబినేషన్‌లో. అదే ‘ఆపద్భాందవుడు’. కానీ, అది బాగా ఆడలేదు.
Also Read: పవన్ సాక్షిగా.! బాలయ్య నోట బండ్ల మంత్రం.!
వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘స్వర్ణకమలం’ అప్పట్లో పెద్ద హిట్. కానీ, ‘చిన్నబ్బాయి’ నిరాశపరిచింది. సినిమా జయాపజయాలకు ఎన్నో కారణాలుంటాయ్.
కానీ, సినిమాకి తనదైన అందాన్ని అద్దిన విశ్వనాథ్ ‘కళా తపస్సు’కి ఈ ఫ్లాపులు చిన్నపాటి ‘మరకనీ’ అంటించలేకపోయాయ్.