Kalpika Ganesh.. కల్పిక గణేష్ అని.. తెలుగు సినిమాల్లో చిన్నా చితకా పాత్రల్లో కనిపించే ఓ నటి.! బహుశా ‘అటెన్షన్’ పాట్లు షురూ చేసినట్టుంది.!
పబ్లిసిటీ కోసం ఎంత వివాదాస్పదంగా వ్యవహరిస్తే అంత బెటర్.. అని రామ్ గోపాల్ వర్మ రచించిన ‘పబ్లిసిటీ సిద్ధాంతాన్ని’ చాలామంది ఫాలో అవుతుంటారు.
ఓ శ్రీరెడ్డి.. ఓ కల్పిక గణేష్ అన్నమాట.! ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి తమ్ముడు, ప్రముఖ సినీ నటుడు నాని మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కింది శ్రీరెడ్డి.
రకుల్ ప్రీత్ సింగ్‌ని రెక్క పీత అనేసిందే..
శ్రీరెడ్డి చాలామంది విమర్శలు చేసింది.. వార్తల్లోకెక్కింది. పవన్ కళ్యాణ్, కొరటాల శివ.. ఇలా లిస్టులో చాలా పేర్లున్నాయ్.
అన్నట్టు, రకుల్ ప్రీత్ సింగ్‌ని రెక్క పీత అనేసింది శ్రీరెడ్డి. నరం లేని నాలిక.. అని ఊరికే అంటారా.? నోటికొచ్చింది వాగడం తమకే చెల్లిందని కొందరు అనుకుంటుంటారు. అదో మూర్ఖత్వం.
Kalpika Ganesh కల్పికకి ఏమయ్యింది.?
ధన్య బాలకృష్ణ అని ఇంకో నటి వుంది. ఆమె మీద మండింది కల్పికకి. అంతకు ముందు అభినవ్ గోమటం అనే నటుడి మీద గుస్సా అయ్యింది కల్పిక.
అన్నట్టు, ధన్య బాలకృష్ణ పెళ్ళి చేసుకుందట.. అదీ ఆల్రెడీ పెళ్ళయిన ఓ సినీ దర్శకుడిని అట. ఆ విషయాన్ని కల్పిక బయటపెట్టింది. కల్పిక లీక్స్ అన్నమాట.
ధన్యని సదరు దర్శకుడు బాలాజీ సరిగ్గా చూసుకోడేమో అనే డౌట్ ఆమెకు వచ్చిందట. కానీ, ఆమెని బాగానే చూసుకుంటున్నాడట.
Also Read: మొగుడూ పెళ్ళాల్ని ‘స్మార్ట్’గా విడదీస్తోన్న మొబైల్ ఫోన్లు.!
కానీ, ధన్మ అంతకు ముందు స్నేహితురాలేగానీ, ఆ తర్వాత తనను బ్లాక్ చేసిందంటూ కల్పిక వాపోయింది. అదన్నమాట అసలు సంగతి.
అయితే, కల్పిక వీడియో తొలగించబడింది. ‘నా జోలికొస్తే భస్మం చేస్తా.. నా పవర్ అలాంటిది..’ అంటూ కల్పిక, ధన్య బాలకృష్ణ మీద రెచ్చిపోయింది.
తన కెరీర్ మీద తాను భస్మాసుర హస్తం ప్రయోగించుకోవడం తొలుత కల్పిక మానెయ్యడం మిచది.! అటెన్షన్ కోసం ఏదైనా చేస్తానంటే.. ఓ శ్రీరెడ్డిలాగా మిగిలిపోతుందంతే.