Kalyan Ram Bimbisara తెలుగు సినిమాకి కొత్త కష్టం వచ్చింది. థియేటర్లకు వెళ్ళేందుకు ప్రేక్షకులు ఇష్టపడటంలేదు. సినిమా చలా బాగుందన్న ‘టాక్’ బయటకు వస్తేనే, థియేటర్ల వైపు జనం చూస్తున్నారు.
‘సినిమా బాగాలేదట..’ అన్న టాక్ వచ్చిందో.. అంతే సంగతి.! అడ్వాన్స్ బుకింగ్స్ కనిపించడంలేదు గనుక, ఓపెనింగ్స్ దారుణంగా వుంటున్నాయి.
‘అబ్బే, థియేటర్లకు జనం రారని అనడం సరి కాదు. మంచి సినిమా తీస్తే వస్తారు..’ అంటూ ‘విక్రమ్’, ‘మేజర్’ సినిమాల గురించి ప్రస్తావించాడు ‘బింబిసార’ కళ్యాణ్‌రామ్.!
Kalyan Ram Bimbisara ఇంతకీ, ‘బింబిసార’కి జనం వస్తారా.?
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ‘బింబిసార’ విడుదలకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో, మీడియాతో మాట్లాడుతూ, ‘మంచి సినిమాలు తీస్తే, జనం థియేటర్లకు వస్తారు..’ అని చెప్పాడు కళ్యాణ్ రామ్. థియేటర్లకు జనం వస్తే మంచిదే కదా.?

కానీ, ‘బింబిసార’ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా జరుగుతాయ్.? సినిమాకి తొలి రోజు టాక్ ఎలా వస్తుంది.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి వుంది.
అన్నిటికీ మించి, సినిమా బాగున్నా.. థియేటర్లలో ఆ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు ఎంతవరకు ఇష్టపడతారు.?
ఇవేనా, ఈ మధ్య ప్రతి సినిమా విపరీతమైన నెగెటివిటీ ఎదుర్కొంటోంది. ఆ ఇంపాక్ట్ ‘బింబిసార’ (Bimbisara) మీద కూడా పడితేనో.!
మాటలెక్కువ.. చేతలు తక్కువ.!
‘రామారావు ఆన్ డ్యూటీ’ దర్శకుడు చాలా ఓవర్ చేశాడు. ట్విట్టర్లో కామెంట్లని ‘రెట్టలు’గా అభివర్ణించాడు.
Also Read: ‘ఆన్ డ్యూటీ’.! నెటిజనాన్ని కెలికేసిన రవితేజ డైరెక్టర్.!
సగటు సినీ అభిమాని అభిప్రాయాన్ని ‘రెట్ట’తో పోల్చాడు గనుకనే, రెట్ట కూడా పడలేదు బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమాకి.
ప్రేక్షకులు దేవుళ్ళే.. అది సినీ జనాల మాటలకే పరిమితం. ఆ ప్రేక్షక దేవుళ్ళను మెప్పించడానికి సినీ జనాలు ఏం చేస్తున్నారు.? ప్రేక్షకుల జేబులు ఖాళీ చేసేలా, వాళ్ళ మతులు చెడేలా సినిమాలు తీస్తే ఎలా.?