Kalyani Priyadarshan Nallani.. ‘హలో’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన క్యూట్ భామ కళ్యాణి ప్రియదర్శన్. తొలి సినిమా రిజల్ట్ బాగోలేకపోయినా.. కళ్యాణి యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది.
అమాయకత్వం నిండిన అందంతో కుర్రకారును ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత ‘చిత్రలహరి’ సినిమాలో నటించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఒకింత బెటర్ రిజల్టే ఇచ్చింది కళ్యాణికి.
అవకాశాల కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పేసుకోకుండా, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ కెరీర్‌ని పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో డిజైన్ చేసుకుంటోంది కళ్యాణి.
Kalyani Priyadarshan Nallani.. బ్యూటీ ఆఫ్ ఇన్నోసెన్స్.!
అయితే, తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదీ క్యూట్ బ్యూటీ. తమిళ, మలయాళంలో ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తోంది.
మలయాళంలో ఓ సినిమా కోసం ముశ్లిం యువతి పాత్రలో నటిస్తోంది కళ్యాణి ప్రియదర్శన్. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తన సినిమాని ప్రమోట్ చేసుకుంటోంది. బ్లాక్ కలర్ గగ్రా చోళీలో అందంగా ముస్తాబై కుర్రోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
Also Read: Anasuya Bharadwaj: అనసూయ ముద్దు.! దాటేసిందా హద్దు.?
అమాయకత్వం నిండిన చూపులతో నెటిజన్లకు అందాల గాలమేస్తోంది కళ్యాణి ఈ పోజుల్లో. అందుకే ఇప్పుడీ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయ్.
తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా, నెట్టింట్లో కళ్యాణికి (Kalyani Priyadarshan) ఫాలోయింగ్ చాలా ఎక్కువ. మరీ గ్లామర్ ఒలకబోయకపోయినా, తనదైన క్యూట్ గ్లామర్‌తో కట్టిపడేయడమే కళ్యాణి ప్రత్యేకత.
ఆ క్యూట్‌నెస్‌కి పడిపోని కుర్రజనం వుంటుందా చెప్పండి.!

అన్నట్టు, తెలుగులో సినిమాల్లేకపోయినా, మలయాళంలో కళ్యాణి ప్రియదర్శన్‌కి (Kalyani Priyadarshan) అవకాశాలు బాగానే వస్తున్నాయ్.!
నటనకు ప్రాధాన్యం వుండే పాత్రల్నే ఎంచుకుంటున్నాననీ, అలాగని గ్లామర్‌కి తాను వ్యతిరేకం కాదనీ అంటోంది ఈ బ్యూటీ.!
హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి అందం, టాలెంట్ మాత్రమే కాదు, లక్కు కూడా వుండాలని చెబుతోంది కళ్యాణి ప్రియదర్శన్.