Kalyanram About Jr NTR.. యంగ్ టైగర్ ఎన్టీయార్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
పాన్ ఇండియా స్టార్ అనడం కంటే, గ్లోబల్ స్టార్ అనడం సబబేమో.! ఔను, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ప్రపంచ మీడియా కొనియాడుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు, సినీ ప్రముఖులూ ఈ సినిమానీ, ఈ సినిమాకి దర్శకత్వం వహించిన రాజమౌళినీ, అలాగే రామ్ చరణ్, ఎన్టీయార్‌లనూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీయార్.. ఆ తర్వాతేంటి.?
ఇంతకీ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ పరిస్థితేంటి.? ఎన్టీయార్ తదుపరి సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది.?
Also Read: పావురం చేసిన హత్య.! మీనా భర్తకి అసలేం జరిగింది.?
ఈ విషయాలపై ఎన్టీయార్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
తన తాజా సినిమా ‘బింబిసార’ ప్రమోషన్ గురించి మీడియా ముందుకొచ్చిన కళ్యాణ్ రామ్, ఎన్టీయార్ గురించి అభిమానులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఎన్టీయార్ మీద బాధ్యత పెరిగిందనీ, అదే సమయంలో భయం కూడా పెరిగిందన్నాడు కళ్యాణ్ రామ్.
Kalyanram About Jr NTR.. ఒత్తిడి మామూలుగా వుండదు మరి.!
ఎన్టీయార్‌కి మాత్రమే కాదు, అతనితో సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులు కూడా భయం, బాధ్యతతో వ్యవహరించాల్సి వస్తోందన్నది కళ్యాణ్ రామ్ వాదన.
నిజమే మరి, అభిమానులకి బోల్డన్ని అంచనాలుంటాయి. ఇంకోపక్క ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆ స్థాయి తగ్గకూడదన్న ఆలోచన ఎన్టీయార్‌కీ, అతనితో సినిమాలు తీసేవాళ్ళకూ వుంటాయ్ మరి.!
Also Read: అడివి శేష్ ఏదో ’కథ‘ చెప్తున్నాడు.. సన్నీలియోన్ వింటోందా.?
‘అభిమానులకు అప్‌డేట్ ఇవ్వాలనే అనుకుంటాం.. కానీ, ఇచ్చే అప్‌డేట్ విషయంలో జాగ్రత్తగా వుండాలి.? అందుకే కొంత ఆలస్యం’ అని కళ్యాణ్ రామ్ చెప్పాడు.
కళ్యాణ్ రామ్ నిర్మాతగా, ఎన్టీయార్ తదుపరి సినిమాలకు సహభాగస్వామ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.