Kalyanram Devil Kamma Ban.. నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ‘డెవిల్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.! సినిమా ఎలా వుంది.? అన్నది వేరే చర్చ.!
అసలంటూ సినిమానే చూడొద్దంటూ ‘కమ్మ’టి మెసేజ్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఓ సామాజిక వర్గానికి సంబంధించి ఈ మెసేజ్‌లు వెళుతుండడం, అవి కాస్తా ఇతరులకూ చేరడంతో ఈ వ్యవహారం పెను దుమారానికి కారణమవుతోంది.
తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే విషయమై తాను, తన తమ్ముడు జూనియర్ ఎన్టీయార్ కలిసి కూర్చుని చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నందమూరి కళ్యాణ్ రామ్ వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం.
Kalyanram Devil Kamma Ban.. రాజకీయాలకు దూరం..
అప్పుడెప్పుడో 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీయార్, తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీయార్ ఎప్పుడూ ఎక్కడా రాజకీయాలు మాట్లాడింది లేదు. తాత స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన టీడీపీ పట్ల గౌరవ భావంతోనే వుంటాడు.
అయితే, ప్రతిసారీ జూనియర్ ఎన్టీయార్‌ని టీడీపీ ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తుండడం చూస్తూనే వున్నాం.
సినిమాలు ఏం చేశాయ్.?
సినిమా వేరు, రాజకీయం వేరు.! నటుడిగా, నిర్మాతగా కళ్యాణ్ రామ్ సినీ రంగంలో తన పని తాను చేసుకుపోతున్నాడు.
అలాంటి నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాపై టీడీపీ మద్దతుదారులు ‘కమ్మ’టి బ్యాన్ విధించడం చర్చనీయాంశంగా మారింది.
కేవలం, ఆ సామాజిక వర్గంలో కొందరు తీసుకున్న ‘బ్యాన్’ నిర్ణయం నేపథ్యంలో అమెరికాలో ‘డెవిల్’ సినిమాకి టిక్కెట్లు సరిగ్గా తెగని పరిస్థితి ఏర్పడింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ, ‘డెవిల్’ సినిమాకి ఓపెనింగ్స్ చాలా డల్లుగానే కనిపిస్తున్నాయి.