Kamala Harris USA First.. కమలా దేవీ హ్యారిస్.. మన భారత సంతతి మహిళ.. అమెరికా అధ్యక్ష పీఠంపైన.. ఆ మాట వినడానికి ఎంత బావుందో కదా.!
తృటిలో తప్పిపోయింది.. లేదంటే, కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్షురాలు అయ్యేవారే.! ట్రంప్ చేతిలో గత ఎన్నికల్లో కమలా దేవి హ్యారిస్ పోరాడి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
అంతకు ముందు కమలా దేవి హ్యారిస్, అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. జో బైడెన్ అప్పట్లో అమెరికా అధ్యక్షులుగా పని చేశారు.
Kamala Harris USA First.. ముగిసిపోయిన చరిత్ర కాదు..
తాజాగా, కమలా దేవి హ్యారిస్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పోరాటం ఆగిపోలేదని ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పీఠంపై ఓ మహిళ కూర్చునే రోజు త్వరలో వుంటుందని చెప్పారామె.
2028లో మళ్ళీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. గత ఎన్నికల్లో ఓడిన కమలా దేవి హ్యారిస్ పట్ల, అమెరికా ప్రజల్లో సానుభూతి వుంది.
పైగా, ట్రంప్ పాలన పట్ల అమెరికాలో రోజు రోజుకీ వ్యతిరేకత పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఇమేజ్, ట్రంప్ పాలన పుణ్యమా అని పలచనవుతున్న సంగతి తెలిసిందే.
అమెరికా ఫస్ట్.. కానీ, మనకేంటి.?
అమెరికా అధ్యక్ష పీఠంపై ఎవరున్నా మన భారత దేశానికి అదనంగా ఒరిగేదేమీ వుండదు. డోనాల్డ్ ట్రంప్ – నరేంద్ర మోడీ.. ఇద్దరూ స్నేహితులని చెప్పుకుంటుంటాం.
కానీ, ట్రంప్ భారత దేశంపై పగబట్టేసిన సంగతి తెలిసిందే. ఎడా పెడా అదనపు సుంకాలు భారత దేశంపై విధిస్తున్నారు ట్రంప్. దానికి తోడు, బోల్డన్ని ఆంక్షలూ విదిస్తున్నారు భారతీయుల మీద.
అధ్యక్ష పీఠంపై ఎవరున్నాసరే, ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదాన్నే వినిపించాలి అమెరికాలో. ఆ విషయంలో ట్రంప్ తర్వాతే ఎవరైనా.!
Also Read: పొలిటికల్ లిక్కర్.. పాపం అందరిదీ.!
రిపబ్లికన్ల ప్రతినిథిగా ట్రంప్, డెమోక్రాట్ల ప్రతినిథిగా హారిస్.. గత ఎన్నికల్ని ఫేస్ చేసిన సంగతి తెలిసిందే. డెమోక్రాట్ల తరఫున ఈసారి కమలా హ్యారిస్ కంటే ఇంకెవరూ బలమైన అభ్యర్థి లేరన్న ప్రచారం జరుగుతోంది.
ముందే చెప్పుకున్నట్లు.. కమలా దేవి హ్యారిస్.. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్నా.. ఆమె కూడా ‘అమెరికా ఫస్ట్’ అనే అనాలి.!
అప్పుడూ, ఆమెకి వ్యతిరేకంగా మనం నినదించే పరిస్థితి రావొచ్చు. కాకపోతే, మన భారత సంతతి మహిళ, అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్నారని చెప్పుకుంటాం అంతే.!
అయినా, 2028 ఎన్నికలంటే, ఇంకా చాలా సమయం వుంది. ఈలోగా అమెరికాలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలాగైనా మారిపోవచ్చు.!
