Table of Contents
Kangana Ranaut.. ఓ వైపు అంగాంగ ప్రదర్శన.. ఇంకో వైపు నీతులు చెబుతూ, రాజకీయాలు మాట్లాడటం.! అసలు కంగనా రనౌత్‌ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి కనిపిస్తోంది అందరికీ.!
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ పేరు చెబితే చాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనే భావన చాలామందిలో కలుగుతుంది. ఆ వివాదాలే ఆమెను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టాయా.? అంటే, నిస్సందేహంగా ‘ఔను’ అనాల్సిందే.
అయితే, కంగనా రనౌత్ టాలెంటెడ్ నటి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. నటన పరంగా టాలెంట్ వుంది కాబట్టి, బోల్డంత గ్లామర్ వుంది కాబట్టి, అన్నిటికీ మించి అదృష్టం వుంది కాబట్టి.. కంగన హీరోయిన్‌గా మంచి స్టార్‌డమ్ సంపాదించుకుంది.
Kangana Ranaut వివాదాలు.. రాజకీయాలూ.!
ఇక, ఆ స్టార్‌డమ్ నిలబెట్టుకోవాలంటే వివాదాలు తప్పనిసరి.. అవసరమైనంత అందాల ప్రదర్శనా తప్పదు.
వివిధాలు సినిమా పరమైనవి మాత్రమే కాదు, రాజకీయ పరమైనవి కూడా అయితే మరింత పాపులారిటీ వస్తుందని కంగనా రనౌత్‌కి బాగా తెలుసు. అందుకే ఆ దిశగా సమాలోచనలు చేసి, టైమింగ్‌తో కూడిన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కుతుంటుంది.

తాజాగా జాతీయ భాష హిందీ విషయమై కంగన సంచలన వ్యాఖ్యలు చేసింది, చేస్తోంది కూడా. హిందీని కాకుండా సంస్కృతాన్ని జాతీయ భాషగా చేయాలన్నది కంగన వాదన.
కంగనా రనౌత్ ఉచిత సలహాలు.!
ఏది జాతీయ భాషగా వుండాలి.? జాతీయ భాష పేరుతో జనం మీద ఓ భాషని బలంగా రుద్దడం 130 కోట్ల మంది ప్రజలున్న భారతదేశంలో ఎంతవరకు సబబు.? అనేవి కూడా ఆలోచించాల్సిన విషయాలే.
ఉత్తరాది, దక్షాణాది అన్న భావన మాత్రమే కాదు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్న భావన కూడా దేశంలో వుంది. భిన్నత్వంలో ఏకత్వం.. మన గొప్పతనం. భిన్నమైన భాషలు, భిన్నమైన అభిప్రాయాలు.. అయినాగానీ, అందరం భారతీయులం.
ఈ పరిస్థితుల్లో ఎవరు భాష పేరుతో ఎలాంటి కామెంట్లు చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలా ఆలోచిస్తే, ఆమె కంగనా రనౌత్ ఎందుకు అవుతుంది.?
కన్నడ సినీ నటుడు సుదీప్, హిందీ ఇకపై ఏమాత్రం జాతీయ భాష కాదు.. అంటూ ఓ సినీ వేడుకలో చేసిన వ్యాఖ్యలతో ఈ భాషా దుమారం సినీ వర్గాల్లో ఓ కుదుపు రేపింది.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, సుదీప్‌కి సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చాక ఆ వివాదం ముదిరి మరింత పాకాన పడింది. కంగన ఎంట్రీతో ఈ వివాదానికి సరికొత్త గ్లామర్ వచ్చిపడింది.!
భాషలకు లోటు లేని దేశమిది.!
ఈ వివాదాన్ని కంగనా రనౌత్ ఇంకెంతగా సాగదీస్తుందో, తనకు అనుకూలంగా మార్చుకుంటుందోగానీ, కంగన తెరపైకి తెచ్చిన జాతీయ భాషగా సంస్కృతం అనే వాదనకు, నినాదానికి మద్దతు బాగానే పెరుగుతోంది.
Also Read: కాజల్ అగర్వాల్‌కి ఎందుకంత అన్యాయం చేశారు.?
ఇంకోపక్క, అసలు జాతీయ భాష అన్న ప్రస్తావనే అనవసరం అనీ.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ.. ఇలా దక్షిణాది ప్రముఖ భాషలతోపాటు, ఉత్తరాదిలోనూ చాలా ప్రత్యేకమైన భాషలు వున్నాయనీ, దేని గౌరవమూ తక్కువ కాదని భాషా నిపుణులు అంటున్నారు.