Kangana Ranaut.. సోషల్ మీడియా కొంతమంది సెలబ్రిటీలకు తల నొప్పిగా మారుతోంటే, మరికొందరికి అదొక అద్భుతమైన వేదిక. ఇంకొకరికి సోషల్ మీడియా ‘వివాదాలకు కేరాఫ్ అడ్రస్’.!
సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సెలబ్రిటీలలో కొందరికి ఓ సరదా. అలా పాపులారిటీ పెంచుకోవడమే సదరు సెలబ్రిటీల ఉద్దేశ్యం.
సోషల్ మీడియా అంటే, జస్ట్ రచ్చబండ లాంటిదే. ఇంటర్నెట్ విప్లవంతో ప్రపంచం ఓ చిన్న గ్రామంగా మారిపోయిన దరమిలా, సోషల్ మీడియాని రచ్చబండగా పేర్కొనడంలో వింతేముంది.
ఈ రచ్చబండ కిక్కే వేరప్పా.!
ఆ రచ్చబండ మీద ముచ్చట్లు, గాసిప్పులు.. ఒకటేంటి.? చాలా వుంటాయ్. అవి హద్దులు దాటితే, బ్యాన్ కూడా తప్పదు. ట్విట్టర్ నుంచి అలా చాలామంది బ్యాన్ అయ్యారు కూడా.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దగ్గర్నుంచి, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ వరకూ.. ట్విట్టర్ నుంచి ‘గెటౌట్’ అయిన సెలబ్రిటీ లిస్టు చాంతాడంత వుంటుంది.

ప్రపంచ కుబేరుడు, ప్రముఖ వ్యాపార అయస్కాంతం.. అదేనండీ, బిజినెస్ మ్యాగ్నెట్ ఎలాన్ మస్క్ ఎప్పుడైతే ట్విట్టర్‌ని సొంతం చేసుకున్నాడో, ఆ వెంటనే ‘డోనాల్డ్ ట్రంప్’ తిరిగొస్తాడు ట్విట్టర్‌లోకి అనే వాదనకు బలం చేకూరింది.
ఎలాన్ మస్క్ స్వయంగా డోనాల్డ్ ట్రంప్‌ని ట్విట్టర్‌లోకి ఆహ్వానిస్తుండగా, కంగనా రనౌత్ కూడా రేపో మాపో ట్విట్టర్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.
Kangana Ranaut రీ-ఎంట్రీ రచ్చ రచ్చే.!
సినిమాల గురించే కాదు, రాజకీయాల గురించీ ట్విట్టర్ వేదికగా కంగనా రనౌత్ పేల్చే సంచలన బాంబులు, వివాదాస్పద వ్యవహారాలు.. వీటి కోసం ఆమె అభిమానులు, ఆమెను వ్యతిరేకించేవారూ ఎదురుచూస్తున్నారు.
కొంతమందిని చూస్తే, సోషల్ మీడియాని వారు ఉపయోగిస్తున్న తీరు ‘కోతికి కొబ్బరికాయ దొరికిన చందాన’ అనాలని అనిపిస్తుందంటారు చాలామంది.
Also Read: Janhvi Kapoor ‘Go Slow’ గ్లామర్ సీక్రెట్ ఇదే.!
సోషల్ మీడియాని మరీ అంత చులకనగా చూడలేం. ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తీసుకొచ్చేస్తోంది సోషల్ మీడియా. అయితే, వాడుకున్నోడికి వాడుకున్నంత.. అదే అసలు సమస్య. అన్నట్టు,
గత కొంతకాలంగా కంగనా రనౌత్ ట్విట్టర్‌కి దూరంగా వుంటున్నా, ఆమె పేరుతో హ్యాష్ ట్యాగ్‌లు మాత్రం ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో వుంటుంటాయ్. దటీజ్ క్వీన్ కంగన.!