బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut The Controversial Queen) ఎప్పుడూ వివాదాల్లో వుండాలనే కోరుకుంటుంది. వివాదాల ద్వారా వచ్చే పబ్లిసిటీ పట్ల ఆమెకు మక్కువ ఎక్కువ. చేసే సినిమాలతో వచ్చే పాపులారిటీ కంటే ఎక్కువగా వివాదాల ద్వారా పాపులారిటీని ఆశిస్తుంటుంది కంగనా రనౌత్. ప్రతిసారీ ఆమెకు వివాదాలు కలిసొస్తుంటాయి.
ఎప్పటికప్పుడు సరికొత్తగా వివాదాలు సృష్టించడంలో ఆమెకు సాటి బహుశా ఇంకెవరూ వుండరేమోననేంతలా కంగనా రనౌత్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుంది. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల దగ్గర్నుంచి, నెపోటిజం వరకూ.. ఆమె టచ్ చేయని పాయింట్ బహుశా వుండదేమో. రాజకీయాల గురించీ మాట్లాడేస్తుంటుంది.
బాలీవుడ్ – డ్రగ్స్ వివాదానికి సంబంధించి కంగనా రనౌత్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల్ని చూశాం. ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చడమూ ఆమెకే చెల్లింది. ఎలాగైనా పబ్లిసిటీ కావాలి కంగనా రనౌత్‌కి. ఆ పబ్లిసిటీ కోసం ఆమె ఎమైనా చేస్తుంది.
సినిమాల్లో హీరోయిన్‌గా సంపాదించుకున్న గుర్తింపు కాస్తా ఈ వివాదాల పబ్లిసిటీకి బోనస్‌గా మారుతోంది. హృతిక్ రోషన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు, టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడిపై అవాకులు చెవాకులు.. ఇలా చెప్పుకుంటూ పోతే కథ చాలా పెద్దదే. అయినాగానీ, నటిగా కంగన టాలెంట్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
అదే ఆమెకు అతి పెద్ద ప్లస్ పాయింట్. తెలుగులో ప్రభాస్ సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఏక్ నిరంజన్’ సినిమా చేసింది కంగనా రనౌత్. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కన్పించలేదుగానీ, సౌత్‌లో మాత్రం ఓ సినిమా చేస్తోంది. అదే జయలలిత బయోపిక్.
హీరోయిన్‌గా తన ఇమేజ్ తగ్గకూడదంటే, వివాదాలతో ఎప్పుడూ లైమ్ లైట్‌లో వుండాల్సిందేనని కంగనా బహుశా బలంగా నమ్ముతోందేమో. ఇదిలా వుంటే, కంగన అత్యుత్సాహంతో భారతీయ జనతా పార్టీ ఇరకాటంలో పడుతోంది. ‘ఆమెకీ మా పార్టీకీ సంబంధం లేదు’ అని బీజేపీ పలు మార్లు చెప్పింది.
అయితే, బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకుంటూ కంగనా రనౌత్, తన ఇమేజ్‌ని మరింత పెంచుకుంటోంది. అది కూడా ఆమెకు ఈ వివాదాల్లో బాగా కలిసొస్తోంది.
ఏదిఏమైనా, కంగన (Kangana Ranaut The Controversial Queen) ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ఈ విషయమై ఆమె చట్టపరమైన సమస్యలూ ఎదుర్కోవాల్సి రావొచ్చనే చర్చ అంతటా జరుగుతోంది.