మెగాస్టార్ చిరంజీవిని శిఖరంగా అభివర్ణించారు సినీ నటుడు కార్తికేయ (Kartikeya About Megastar Chiranjeevi). ‘ఆర్ఎక్స్ 100’ ఫేం కార్తికేయ, ‘బెదురులంక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
కార్తికేయ తనను తాను మెగాభిమానిగా చెప్పుకుంటాడు. నిజానికి, తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే, చిరంజీవికి అభిమానులు చాలామందే వున్నారు.
దురదృష్టమేంటంటే, చిరంజీవి మీద పనిగట్టుకుని దుష్ప్రచారం జరుగుతున్నా, పరిశ్రమలోని చిరంజీవి అభిమానులు చాలా తక్కువగా స్పందిస్తుంటారు.
చిరంజీవి సాధించిన విజయాల ముందర, ‘భోళా శంకర్’ చాలా చాలా చిన్నదని కార్తికేయ అభిప్రాయపడ్డాడు.
Kartikeya About Megastar Chiranjeevi.. శిఖరం ముందర.. చాలా చాలా చిన్నది..
‘ఆయన ఎన్నో విజయాలు చూసి వుంటారు.. కొన్ని పరాజయాలూ చూసి వుంటారు.. ఇప్పుడు ‘భోళా శంకర్’ మీద కనిపిస్తున్న నెగెటివిటీ, ఆయన దృష్టిలో చాలా చాలా చిన్నది’ అంటున్నాడు కార్తికేయ.
గొప్ప వ్యక్తి చిరంజీవి మీద విమర్శలు రావడం బాధాకరం. కేవలం చిరంజీవి మీద విషం చిమ్మడం ద్వారా పాపులారిటీ పెంచుకోవాలనుకునేవారిని చూస్తే జాలేస్తుందని కార్తికేయ చెప్పాడు.
Also Read: అప్పుడూ.. ఇప్పుడూ నన్నే తిడుతున్నారు: రేణుదేశాయ్
‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమా పరాజయం తర్వాత, చిరంజీవికీ (Mega Star Chiranjeevi) నిర్మాతకీ మధ్య గొడవలంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ దుష్ప్రచారాన్ని స్వయంగా నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) కూడా ఖండించారు. అయినా, పుకార్లను పోగేసే కొందరు, వాటిని కొనసాగిస్తూనే వున్నారు.
కార్తికేయ వ్యాఖ్యలతో, అలాంటి పుకార్ల పుల్లారావ్‌లు మారతారని అనుకోలేంగానీ, పరిశ్రమ నుంచి ఓ యంగ్ హీరో, మెగాస్టార్ చిరంజీవికి మద్దతుగా నిలబడటాన్ని మాత్రం అభినందించాల్సిందే.
ఒక్కటి మాత్రం నిజం.. 150కి పైగా సినిమాలు చేసి, మెగాస్టార్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్న చిరంజీవికి, ఒక్క సినిమా పరాజయం.. అంత పెద్ద విషయమేమీ కాదు.
ఏదైనా పరాజయం వచ్చాక బౌన్స్ బ్యాక్ అవడం.. హిట్టొచ్చాక.. స్టార్‌డమ్ మరింత పెంచుకోవడం.. చిరంజీవికి అవాటైన వ్యవహారమే.