Kashmira Pardeshi Beauty Mantra.. ఎవరీ బ్యూటీ.! ఫొటోగ్రఫీ అదిరింది కదా.! చక్కనమ్మ ఎలా వున్నా అందమే మరి.! ఈ బ్యూటీ పేరేమో కాశ్మీరా పరదేశి.!
తెలుగులో ‘కిరాక్ పార్టీ’ సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఒకట్రెండు తెలుగు సినిమాల్లో కనిపించింది. తమిళ సినిమాల్లోనూ నటిస్తోంది.
మొన్నీమధ్యనే ఓ వెబ్ సిరీస్‌లో కూడా కనిపించింది కాశ్మీరా పరదేశి. అందం, అభినయం.. ఈ రెండూ కాశ్మీరా పరదేశి సొంతం.
Kashmira Pardeshi Beauty Mantra.. తొందరేం లేదట..
అవకాశాల కోసం తొందరేమీ లేదని చెబుతుంటుంది కాశ్మీరా పరదేశి. గ్లామర్‌కి తానేమీ ‘నో’ చెప్పబోనుగానీ, వల్గారిటీ అయితే అస్సలు తన వల్ల కాదంటోందీ భామ.

గ్లామర్ వేరు, వల్గారిటీ వేరు.. క్యూటుగా వుండేంతవరకూ గ్లామర్ విషయంలో పెద్దగా మొహమాటాలేమీ లేవన్నది కాశ్మీరా పరదేశి చెబుతున్నమాట.
ప్రకృతి అందాల్ని ఆస్వాదించడమంటే కాశ్మీరా పరదేశికి ఇష్టమట. ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తుంటుందట.. ప్రకృతిని ఆస్వాదించడానికి.
తిండి తగినంత.. నిద్ర సరిపడేంత..
శరీరానికి అవసరమైన ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అవసరమైనంత తప్పనిసరి.. అని అంటోంది కాశ్మీరా.
అంతే కాదండోయ్, తగినంత తిండి.. అవసరమైనంత నిద్రతోపాటు.. వ్యాయామం కూడా చెయ్యక తప్పదని కాశ్మీరా చెబుతోంది.
అందుకేనేమో, ఇంత క్యూటుగా.. ఇంత హ్యాపీగా.. ఇంత ఆరోగ్యంగా కనిపిస్తుంటుంది కాశ్మీరా పరదేశి.