Katrina Kaif Wedding మన ‘మల్లీశ్వరి’ ఏజ్ బార్ అయ్యాకా పెళ్లి మీదకి ధ్యాస మళ్లించింది. తన తొలి తెలుగు సినిమాలో హీరోని ‘పెళ్లి కాని ప్రసాదు..’ అంటూ ఆట పట్టించిన ఈ బ్యూటీ, లేటు వయసులో పెళ్లి పీటలెక్కుతుండడంపై బోలెడన్ని సెటైర్లు పడ్డాయి. అది ఆమె ఇష్టం.
సినిమా కెరీర్ పరంగా అత్యున్నత శిఖరాల్ని అధిరోహించేసింది కత్రినా కైఫ్ (Katrina Kaif). ఈ క్రమంలో బోలెడన్ని ఎఫైర్స్ కూడా నడిచాయ్. రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్.. చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే. చివరకి తన కన్నా వయసులో ఐదేళ్లు చిన్నోడైన విక్కీ కౌషల్‌ని ‘జతగాడు’గా ఎంచుకుంది. బహుశా ప్రియాంకా చోప్రాని ఆదర్శంగా తీసుకున్నట్లుంది కత్రినా కైఫ్.
Katrina Kaif Wedding.. లాభం అక్షరాలా వంద కోట్లా.?
కత్రినా కైఫ్ ఎవర్ని పెళ్లాడాలన్నది మనం డిసైడ్ చేయలేం. చేయకూడదు కూడా. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలన్నది ఆమె ఇష్టం. అయితే, సెలబ్రిటీ కదా.. ఆమె పెళ్లి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి జనాలకు ఉంటుంది. దాన్ని బాగా క్యాష్ చేసుకుంది కత్రినా.
అసలు ఇంత సస్పెన్స్ అవసరమా.? నరాలు తెగే ఉత్కంఠని సృష్టించింది. అందుకేనేమో, పెళ్లి తంతు కవరేజ్ కోసం కోట్లాది రూపాయల డీల్ సెట్టయ్యిందట. కనీ వినీ ఎరుగని స్థాయిలో డీల్.. అంటూ ప్రచారం జరుగుతోందండోయ్. సెలబ్రిటీలు ఏం చేసినా దాని వెనుక ఇలాంటి ఓ ప్రసహనం ఉండి తీరుతుంది.

ఓటీటీ సంస్థ ఒకటి ఈ పెళ్లి ప్రసార హక్కుల్ని దక్కించుకుని, వంద కోట్లు చెల్లించిందని ప్రచారం జరుగుతోంది. నిజమో, కాదో కానీ, నిజమైతే మాత్రం దేశ చరిత్రలోనే ఇలాంటి ఒక డీల్ ఇంతకు ముందెన్నడూ జరిగి ఉండదు.
Salman Khan సల్మాన్ అభిమానుల గుస్సా..
ఇంతకీ, సల్మాన్ ఖాన్ (Salman Khan) పరిస్థితేంటీ.? ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. ఏం చేస్తున్నాడు.? దీని మీద మళ్లీ బోలెడంత రచ్చ. సల్మాన్ ఖాన్‌కి ఇలాంటివి కొత్తేమీ కాదు. సంగీతా బిజ్లానీ, ఐశ్వర్యారాయ్.. ఇలా పేర్లు రాసుకుంటూ పోతే డజన్ల కొద్దీ పేర్లు తెరపైకి వస్తాయ్. సో, అదిప్పుడు అప్రస్తుతం.
Also Read: Samantha Special Song, సన్నీలియోన్‌తో పోలికా.?
‘శుభం పలకరా అంటే, డాష్ డాష్..’ అన్నాడట వెనకటికొకడు. కత్రినా పెళ్లి సందడిపై సల్మాన్ అభిమానులు గుస్సా అవుతున్నారు మరి. ఈ పెళ్లి (Katrina Kaif Wedding) పెటాకులవడానికి నెలల సమయం కూడా అవసరం లేదు.. అంటున్నారు సల్మాన్ (Salman Khan) భక్తులు. ‘పైశాచికానందం’ అంటే ఇదేనేమో.