సల్మాన్ ఖాన్ ఎందుకు పెళ్ళి చేసుకోలేదు.? ప్రభాస్ ఎప్పుడు పెళ్ళి కబురు చెబుతాడు.? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం కష్టం. అయినా వాళ్ళ పెళ్ళి వాళ్ళ ఇష్టం. కానీ, అభిమానులకూ కొన్ని ఆశలుంటాయ్ కదా.! హీరోలకే కాదు, హీరోయిన్లకీ ఈ పెళ్ళి ప్రశ్నలు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. కీర్తి సురేష్ (Keerthy Suresh About Love And Marriage) ఇందుకు మినహాయింపేమీ కాదు.
కీర్తి సురేష్ పెళ్ళంట.. అంటూ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలాసార్లు కుప్పలు తెప్పలుగా గాసిప్స్ వచ్చాయి. ఓ డజను మంది పెళ్ళ కొడుకుల్ని కీర్తి సురేష్ పేరుతో లింకులు పెట్టేశారు. కానీ, కీర్తి సురేష్ (Keerthy Suresh Glamour) మాత్రం.. ఇంకా సింగిల్ మాత్రమే.
పెళ్ళి పుకార్ల గురించి తాజాగా కీర్తి సురేష్ (Keerthy Suresh) ఇంకోసారి స్పందించింది. చాలాసార్లు ఆ పుకార్లు నవ్వు తెప్పిస్తాయని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటానుగానీ, అదెప్పుడో తనకు కూడా తెలియదని చెప్పిందీ బ్యూటీ.
ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తున్నానంటోన్న కీర్తి సురేష్ (Keerthy Suresh Hot), పెళ్ళి సినిమాలకు అడ్డంకి కాదని చాలామంది హీరోయిన్లు నిరూపించిన విషయాన్ని ప్రస్తావించింది. ‘పెళ్ళి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పనిలేదు. సమయం కలిసొస్తే, జరిగిపోతుందంతే..’ అని నవ్వేసింది కీర్తి సురేష్.
ప్రస్తుతానికైతే సినిమాలతో తప్ప, ఎవరితోనూ ప్రేమలో పడలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చింది కీర్తి (Keerthy Suresh About Love And Marriage). తొలిసారిగా మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం జత కడుతున్న విషయం విదితమే.
