Keerthy Suresh Multi Tasking.. కీర్తి సురేష్ రూటు మార్చేసింది. పెద్ద తెరపై స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. అందులో నో డౌట్. అయితే, ఇప్పుడు పెద్ద తెరపై ఆమెకు పెద్దగా అవకాశాల్లేవు.
‘భోళా శంకర్’ ఎఫెక్ట్‌తో కీర్తి సురేష్‌కి తెలుగులో ఆఫర్లు కాస్త తగ్గాయ్. అయినా, కీర్తి సురేష్ మహానటి. ఎప్పుడైనా మళ్లీ పుంజుకోవచ్చు. పడి లేచిన కెరటంలా విజృంభించొచ్చు.
అసలు మ్యాటర్ ఏంటంటే, ఓటీటీలో కీర్తి సురేష్ విశ్వరూపం చూపించేందుకు సిద్ధమవుతోంది. ఓటీటీ అంటే ఆర్టిస్టుల్లోని అసలు సిసలు టాలెంట్‌ని వెలికి తీసేందుకు బెస్ట్ ప్లాట్‌ఫ్లామ్‌గా చెప్పుకోవచ్చు.
Keerthy Suresh Multi Tasking.. మహానటి విశ్వరూపమే.!
సమంత, కాజల్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు మొదలుకొని, రెజీనా, హెబ్బా పటేల్ తదితర ఓ మోస్తరు హీరోయిన్లు సైతం ఇప్పటికే ఓటీటీలో తమదైన ప్రతిభ చూపిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.

అలాంటిది, మహానటి కీర్తి సురేష్‌కే ఆ తరహా ఛాన్స్ వస్తే.. ఆల్రెడీ వచ్చేసింది. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఓ వెబ్ సిరీస్‌లో కీర్తి సురేష్ నటిస్తోంది.
బాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో ఈ వెబ్ సిరీస్ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.
బాలీవుడ్‌లో టాలెంట్ చూపిస్తోన్న మహానటి.!
సెన్సేషనల్ నటి రాధికా ఆప్టే ఈ సిరీస్‌లో మరో కీలక పాత్ర పోషిస్తోంది. హిందీతో పాటూ, తెలుగు, తమిళ, మలయాళ తదితర భాషల్లో ఈ సిరీస్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
గతంలో ‘చిన్ని’ వంటి సినిమాల్లో కీర్తి సురేష్ (Keerthy Suresh) పర్‌ఫామెన్స్ చూసి సినీ మేధావులంతా అవాక్కయ్యారు. శభాష్ అని కీర్తించారు.

ఈ సారి ఓటీటీలో కీర్తి సురేష్ తన టాలెంట్‌ని ఇంకే రేంజ్‌కి తీసుకెళ్లిపోతుందో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అన్నట్లు బాలీవుడ్‌లోనే అల్రెడీ ఓ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తెరి’ మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
Also Read: Pragya Jaiswal: ఎర్ర మందారం! ఎరుపెక్కిన ప్రగ్యానందం!
హీరోయిన్‌గా గ్లామరస్ పాత్రలు, హీరోయిన్ సెంట్రిక్ మూవీస్, వివిధ భాషల్లో సినిమాలు, ఆపై వెబ్ సిరీస్‌లు.. ఇలాంటి మల్టీ టాస్కింగ్.. కీర్తి సురేష్‌కి మాత్రమే సొంతమని చెప్పొచ్చేమో.!