Ketika Sharma.. పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ హీరోగా నిర్మించిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాల తర్వాత కేతిక శర్మ ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో నటిగా మంచి మార్కులేయించుకుంది.
ఈ బ్యూటీ పేరిప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మార్మోగిపోతోంది. అందానికి అందం.. దానికి తోడు నటిగా తనను తాను నిరూపించుకుంటుండడంతో కేతికకు అవకాశాలు పోటెత్తుతున్నాయ్.
Ketika Sharma టిల్లుగానితో జత కట్టబోతోందా.?
‘డీజే టిల్లు’ ఫేం సిద్దూ జొన్నలగడ్డ సరసన కేతిక శర్మ ఛాన్స్ కొట్టేసిందన్నది తాజా ఖబర్. ‘టిల్లు స్క్వేర్’ పేరుతో రూపొందుతోన్న సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ని హీరోయిన్‌గా అనుకున్నారు.

అయితే, అనివార్య కారణాల వల్ల ఆమె ఆ సినిమా నుంచి తప్పుకుంది. తాజాగా మీనాక్షి చౌదరి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడేమో కేతిక శర్మ ఆ సినిమాలో హీరోయిన్ అంటున్నారు.
తెలుగులో ‘డిజె టిల్లు’ సంచలన విజయాన్ని అందుకుంది. దానికి సీక్వెల్‌ని ‘టిల్లు స్క్వేర్’ పేరుతో రూపొందిస్తున్నారు.
ఏమో.. ఏమౌతుందో.!
అసలు ‘డిజె టిల్లు’ సినిమాలో హీరోయిన్లెందుకు మారుతున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. అలాంటి గందరగోళంతో వున్న ప్రాజెక్టులోకి కేతిక వెళుతుందా.? అన్నదీ డౌటే.
Also Read: జీవితంలో ఏదో ఒక్కటే తినాల్సి వస్తే ఏం చెయ్యాలి.?
కానీ, అక్కడ బ్యానర్ పెద్దది. సితార సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హీరో జొన్నలగడ్డ సిద్దుతోనే అసలు సమస్య.. అన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న ప్రచారం.