Kinjarapu Ram Mohan Naidu Indigo.. దేశంలో ఎక్కడన్నా రైలు ప్రమాదం జరిగితే, ముందుగా రైల్వే శాఖ మంత్రినే కదా ప్రశ్నిస్తాం.! బాధ్యత తీసుకుని, పదవులకు రాజీనామా చేయడం అనేది నైతికత.!
విమానయాన సంస్థ వివాదంలో ఇరుక్కుపోతే, ప్రయాణీకులు నానా అవస్థలూ పడుతోంటే, పౌర విమాన యాన శాఖ మంత్రిదే కదా బాధ్యత.?
సరే, రాజీనామా అనేది సమస్యకు పరిష్కారమా.? అంటే, కాదని నిస్సందేహంగా చెప్పొచ్చు. రాజకీయాల్లో నైతిక విలువల గురించి ఇప్పుడు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.!
ఇండిగో ఎయిర్ లైన్స్ వివాదంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు టార్గెట్ అయిపోయారు చాలామందికి. సొంత పార్టీ నాయకులు కూడా, రామ్మోహన్ మీదనే విరుచుకుపడిపోతున్నారు.
Kinjarapu Ram Mohan Naidu Indigo.. రాముడు.. మంచి బాలుడు కాదిప్పుడు.!
జాతీయ స్థాయిలో తలెత్తిన వివాదంపై, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వార్ రూమ్ ఏర్పాటు చేసి, సమీక్షిస్తున్నారని ఓ టీడీపీ నేత, జాతీయ మీడియాతో చెప్పి, అగ్నికి ఆజ్యం పోశారు.
అక్కడి నుంచి, టీడీపీ ట్రోల్ అవుతోంది.. రామ్మోహన్ నాయుడు ట్రోల్ అవుతున్నారు. టీడీపీ కార్యకర్తలకు ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి.
గతంలో, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వివాదంలో ఇరుక్కుపోయింది.. అది మూతపడిపోయింది కూడా.! ఇండిగో ఏమవుతుందన్నది ముందు ముందు తేలుతుంది.
కానీ, మంచి వక్త.. వివాద రహితుడు అయిన రామ్మోహన్ నాయుడు, టార్గెట్ అయిపోవడమే చాలామందికి నచ్చట్లేదు. రీల్స్ మంత్రి.. అనే విమర్శలొస్తున్నాయి రామ్మోహన్ మీద.
రీల్స్ మంత్రి.? నెట్ ప్రాక్టీస్.?
గతంలో, ఓ విమాన ప్రమాదం జరిగినప్పుడు వచ్చింది రీల్స్ మంత్రి.. అనే బిరుదు కింజరాపు రామ్మోహన్ నాయుడు.
స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడైన రామ్మోహన్, రాజకీయాల్లోకి వచ్చింది.. తండ్రి అకాల మరణంతో. రాజకీయాల్లోకి వస్తూనే, తనదైన ప్రత్యేకతను చాటుకున్నారాయన.
చట్ట సభల్లో వివిధ భాషల్లో అనర్గళంగా మాట్లాడటమే కాదు, రాజకీయ విమర్శలు చేయడంలో ఆయన ఒకింత బాధ్యతగా వ్యవహరిస్తారు. అందుకే, ఆయన మీద కూడా రాజకీయ విమర్శలు తక్కువ.
కానీ, టైమ్ బాలేదిప్పుడు.. కింజరాపు రామ్మోహన్ నాయుడు టార్గెట్ అయిపోయారు చాలామందికి. ఇండిగో వివాదంలో కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఇంకాస్త చురుగ్గా వ్యవహరించి వుండాల్సింది.
