Kiran Abbavaram Dilruba.. కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘దిల్ రుబా’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్స్ జరుగుతున్నాయ్.
తాజాగా, ఓ పాటకు సంబంధించిన ఈవెంట్‌లో సినీ ఎర్నలిస్టులు, చిత్ర యూనిట్‌పై ప్రశ్నాస్త్రాలు సంధించేశాయి. అడిగి తన్నించుకోవడం.. అని ఇలాంటి సందర్భాల గురించే చెప్తారేమో.!
అసలు విషయమేంటంటే, ఓ సినీ ఎర్నలిస్టు.. ‘దిల్ రుబా’ టైటిల్ గురించి చిత్ర విచిత్రమైన ప్రశ్నని సంధించాడు. దానికి ‘కొట్టినట్లు మాట్లాడతారేంటండీ.?’ అంటూ కిరణ్ ‘కవర్’ చేసేందుకు ప్రయత్నించాడు.
Kiran Abbavaram Dilruba.. పాన్ ఇండియానా.?
‘దిల్ రుబా’ అనే పేరు హిందీ కాబట్టి, సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారా.? ఇది కేవలం తెలుగు సినిమాయేనా.? అన్నది సదరు సినీ ఎర్నలిస్టు సంధించిన పిచ్చి ప్రశ్న.
‘అలా ఏం లేదండీ.! ఇంగ్లీషు పదాన్ని టైటిల్‌గా పెడితే, అదేమీ ఇంగ్లీషు సినిమా అయిపోదు కదా..’ అంటూ కిరణ్ అబ్బవరం సమాధానమిచ్చాడు.

అంతే కాదు, కథ పరంగా స్పాన్ తక్కువే గనుక, రీజినల్ ఫిలింగానే అనుకున్నామనీ, అనుకున్నదే తెరకెక్కించామనీ నిజాయితీగానే చెప్పాడు కిరణ్ అబ్బవరం.
గత కొంతకాలంగా, సినీ ఈవెంట్లలో సినీ ఎర్నలిస్టులు పిచ్చి పిచ్చి ప్రశ్నలతో సినీ ప్రముఖుల్ని వేధిస్తున్నమాట వాస్తవం. సమాధానం చెప్పకపోతే బాగేదోమే.. అని సినీ జనం మొహమాటపడుతున్నారు.
ఒకరిద్దరు సినీ ప్రముఖులు, సినీ ఎర్నలిస్టుల్ని గట్టిగానే ఏసుకుంటున్నారనుకోండి.. అది వేరే సంగతి.
పరాన్నజీవులు..
మొన్నీమధ్యనే ఓ లేడీ ఎర్నలిస్టు, సినీ నటి అనన్య నాగళ్ళని ‘కాస్టింగ్ కౌచ్’ గురించి జుగుప్సాకరంగా ప్రశ్నించిన విషయం విదితమే.
అలాగే, కాటికి కాలు చాపిన ఓ సీనియర్ ఎర్నలిస్టు, సినీ నటి స్వాతి (కలర్స్ స్వాతి) వైవాహిక జీవితం, డివోర్స్ గురించి పనికిమాలిన ప్రశ్నలు సంధించి, పైశాచికానందాన్ని ప్రదర్శించాడు.
Also Read: ఓయ్ ఎర్నలిస్టూ.! నువ్వూ కమిట్మెంట్ ఇచ్చావా.?
ఇక్కడ, ఇలా సినీ ఎర్నలిస్టులు దిగజారడానికి సినీ ప్రముఖులూ ఓ కారణమన్న విమర్శ లేకపోలేదు. అలాంటి పనికిమాలినోళ్ళని సినీ ప్రెస్ మీట్లకు దూరంగా వుంచాలి కదా మరి.!
దూరం పెట్టకపోవడమంటే, వాళ్ళతో కుమ్మక్కయి.. సినీ ఈవెంట్లని సినీ ప్రముఖులే రసాబాస చేసుకుంటున్నారని అనుకోవాల్సి వస్తుంది.