Kiran Abbavaram KRamp Kakkurthi.. కిరణ్ అబ్బవరం.. తెలుగు తెరపైకి నిజంగానే ఓ సంచలనంలా దూసుకొచ్చాడు. తొలి సినిమాతో క్లీన్ అండ్ లవ్లీగా హిట్టు కొట్టేశాడు.!
మొన్నీమధ్యనే ‘క’ పేరుతో ఓ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. విమర్శకుల ప్రశంసలూ అందుకున్నాడు. నిర్మాతగా మంచి లాభాల్ని గడించాడు కూడా.
ఇంతలోనే, ‘కె-ర్యాంప్’ అంటూ ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు కిరణ్ అబ్బవరం.
అన్నట్టు, మొన్నీమధ్యనే కిరణ్ అబ్బవరం పెళ్ళి చేసుకున్నాడు, ఓ బిడ్డకు తండ్రయ్యాడు కూడా.! ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. అది తర్వాత మీకు అర్థమవుతుంది.
Kiran Abbavaram KRamp Kakkurthi.. బూతుల ర్యాంప్.!
‘కె-ర్యాంప్’ నుంచి టీజర్ బటయకు వచ్చింది తాజాగా. టీజర్ నిండా బూతులే బూతులు. బహుశా, బూతులే తన కెరీర్‌కి భవిష్యత్తు.. అని కిరణ్ అబ్బవరం బలంగా నమ్మాడేమో.!
కిరణ్ అబ్బవరం సరసన ‘కె-ర్యాంప్’ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. అక్టోబర్ 18న విడుదల కానుంది ‘కె-ర్యాంప్’.

ఈ దీపావళికి నవ్వుల పండగ.. అంటూ, ‘కె-ర్యాప్’ గురించి చెబుతున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. నవ్వుల పండగ సంగతేమోగానీ, ‘కె-ర్యాంప్’ అంటే, బూతుల పండగ.. అన్నట్లుంది వ్యవహారం.
టీజర్ మొదలు పెట్టడంతోనే, బూతులతో షురూ చేశాడు కిరణ్ అబ్బవరం. ఆపై మరిన్ని బూతులు జొప్పించేశారు ‘కె-ర్యాంప్’ టీజర్‌లో.!
ఎందుకింత కక్కుర్తి.?
టీజర్‌లోనే బూతులు ఇలా వుంటే, సినిమాలో ఇంకెన్ని బూతులున్నాయో ఏమో.! కక్కుర్తి.. అన్నట్లుగా, హీరోయిన్ యుక్తి తరేజాతో ఎడా పెడా లిప్ లాక్స్ కూడా గట్టిగానే లాగేశాడు ఈ యంగ్ హీరో.
Also Read: జస్ట్ ఆస్కింగూ.! జూనియర్ ఎన్టీయార్‌ని ఆపుతున్నదెవరూ.?
పెళ్ళయ్యిందీ.. ఓ బిడ్డకు తండ్రయ్యాడూ.. ఆ మాత్రం బాధ్యత వుండక్కర్లా.? అంటూ, నెటిజన్లు కిరణ్ అబ్బవరంని ‘కె-ర్యాంప్’ టీజర్‌ని చూసి, ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.
అయినా, కామెడీ ముసుగులో ఏం చేసినా చెల్లిపోతుంది.. లవ్ పేరుతో తెర మీద ఏం చేసినా వర్కవుట్ అయిపోతుందనుకుంటే ఎలా కిరణ్.? కాస్త బాధ్యత వుండాలి కదా.?
