Kohinoor Diamond India.. కోహినూర్ వజ్రం.! ఇది భారతీయ సంపద. కానీ, ఒకప్పుడు. భారతదేశం నానా రకాలుగా దోపిడీకి గురైంది.
దశాబ్దాల క్రితం నాటి.. కాదు కాదు, శతాబ్దాల క్రితం మాట అది.! అప్పట్లో మన తెలుగు నేల మీదనే ఈ కోహినూర్ వజ్రం దొరికిందని చరిత్ర చెబుతోంది.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొల్లూరు ప్రాంతంలో ఈ వజ్రం దొరికిందని చారిత్రక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. గోల్కొండ పాలకులు.. ఢిల్లీ పాలకులు.. ఇలా ఈ వజ్రాన్ని ఎవరెవరో, ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయారు.
చివరికి అది బ్రిటన్ రాణి కిరీటంలోకి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు.. బ్రిటన్ రాణి.. ప్రపంచంలో ఈ రెండు స్థానాలకీ వున్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
Kohinoor Diamond India.. ఇప్పుడెందుకీ చర్చ.?
బ్రిటన్ క్వీన్ ఎలిజిబెత్-2 అనారోగ్యంతో కన్నుమూయడంతో, ఇప్పుడు మళ్ళీ కోహినూర్ వజ్రం గురించిన చర్చ జరుగుతోంది. భారతదేశానికి ఆ వజ్రాన్ని తిరిగిచ్చేయాలని ఆమె అనుకున్నారట.
నిజంగానే క్వీన్ ఎలిజబెత్ అలాంటి ఆలోచన చేశారా.? లేదా.? ఏమో, అలాగని ప్రచారమైతే జరుగుతోంది.

పోనీ, ఇప్పుడన్నా ఆ వజ్రం భారతదేశానికి చేరుకుంటుందా.? ఛాన్సే లేదు. అలాంటి ఆసక్తి కూడా భారత ప్రభుత్వానికి వున్నట్లు కనిపించడం లేదాయె.!
వుంటే, అడిగితే.. ఏమో, బ్రిటన్ పాలకులు దయతలిచి.. మన కోహినూర్ వజ్రాన్ని మనకిచ్చేస్తారేమో.! అన్నట్టు, క్వీన్ ఎలిజబెల్ మృతికి ఒక రోజు సంతాపం కూడా ప్రకటించేసుకున్నాం మనం.
విలువైనదే.! కానీ..
ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రంగా కోహినూర్ వజ్రం గురించి చెబుతుంటాం. కోహ్-ఇ-నూర్.. ఇదీ కోహినూర్ వజ్రం అసలు పేరు.
Also Read: పారాసిటమాల్.! వెయ్యి కోట్ల మాఫియా.. అంతేనా.?
కోహినూర్ వజ్రం ఇప్పుడు ఇంకో రాణి నెత్తిన వుండబోతోంది. 105.6 క్యారెట్ల ఈ వజ్రానికి సంబంధించి యాజమాన్య హక్కులపై వివాదం.. దాదాపు నాలుగు దేశాల్లో ఇంకా కొనసాగుతుండడం కొసమెరుపు.
ఆక్రమణలు, దురాక్రమణలు, హత్యలు, మారణహోమం.. ఇలా ఎన్నింటినో చవిచూసేసింది ఈ వజ్రం. ఒకరకంగా చెప్పాలంటే రక్తపుటేరులకు సాక్షమీ కోహినూర్ వజ్రం.!