సినీ పరిశ్రమలో చాలామంది కమెడియన్లు వుండొచ్చుగాక. కొందరికి మాత్రమే ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంటుంది. అలాంటి కొద్ది మందిలో మళ్ళీ చాలా చాలా అరుదైన వ్యక్తిత్వం వున్న వ్యక్తి ఆయన. పరిచయం అక్కర్లేని పేరది. ఆయనే వివేక్. కాదు కాదు, వివేక్ సర్ (Kollywood Actor Vivek Sir No More).
తమిళ సినిమాలతో తెలుగు, హిందీ ప్రేక్షకులకీ సుపరిచితుడైన వివేక్, గుండెపోటుతో కన్నుమూసిన విషయం విదితమే. తమిళ సినీ పరిశ్రమ, వివేక్ మరణవార్త విని గుండె పగిలేలా రోదిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా వివేక్ (Vivek Kollywood Actor)మరణం గురించి తెలిసి నిర్ఘాంతపోయారు.
హాస్యనటుడిగా సుమారు 300కి పైగా సినిమాల్లో నటించిన వివేక్, అంతకు మించి.. మంచి వ్యక్తిత్వం, మానవత్వం వున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. అందుకే, ‘కమెడియన్ వివేక్’ అనడం కంటే, ‘వివేక్ సర్’ అనడానికే చాలామంది ఇష్టపడతారు. దాదాపుగా తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటీనటులంతా ఆయన్ని ‘వివేక్ సర్’ (Tamil Cinema Comedian Vivek Sir) అనే పిలుస్తారు.. అదీ ఆయన మీద వాళ్ళకున్న గౌరవం.
ఇక, సినీ అభిమానుల్లోనూ ‘సర్’ అనే గుర్తింపు సంపాదించుకున్న వివేక్, అర్థాంతరంగా తనువు చాలించడం, యావత్ సినీ పరిశ్రమకు తీరని లోటుగానే చెప్పుకోవాలి. ఇటీవల కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న వివేక్, ఒకరోజు వ్యవధిలోనే గుండెపోటుకి గురయ్యారు.
తీవ్రమైన గుండెపోటు రావడంతో, ఆయన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రికి వచ్చేటప్పటికే వివేక్ అపస్మారక స్థితిలో వున్నారనీ, ఎక్మో సాయంతో వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పిన వైద్యులు, ఎంతగా శ్రమించినప్పటికీ, ఆయన్ని కాపాడలేకపోయారు.
తమిళ సినీ ప్రముఖులైన రజనీకాంత్ తదితరులతోపాటు, తెలుగు సినీ ప్రముఖులూ వివేక్ (Kollywood Actor Vivek Sir No More) మరణం పట్ల తీవ్ర దిగ్రభాంతిని వ్యక్తం చేశారు. తాను నటించే సినిమాల్లో తన పాత్ర కోసం తనే స్వయంగా డైలాగులు కూడా రాసుకునేవారాయన. ఆపదలో వున్నవారికి సాయమందించడ, కొత్త తరం నటీనటుల్ని ప్రోత్సహించడం.. ఇలాంటివన్నీ ఆయన్ని ‘సర్’గా మార్చాయి.