నవ్విపోదురుగాక.. పవన్ కళ్యాణ్ మీద కరోనా ‘రివ్యూ’నా.?

 నవ్విపోదురుగాక.. పవన్ కళ్యాణ్ మీద కరోనా ‘రివ్యూ’నా.?

Pawan Kalyan Covid 19 Positive and Negative Reviews

దిగజారిపోవడంలో ఇదొక పరాకాష్ట. లేకపోతే, దేశంలో చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.. కానీ, వాళ్ళెవరి విషయంలోనూ కరోనా రివ్యూలు రాలేదు. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Covid 19 Positive and Negative Reviews) విషయంలో మాత్రం కరోనా రివ్యూలొచ్చాయి. ఇదెక్కడి పైత్యం.? పైత్యం కాదు, పైశాచికానందం.

పవన్ కళ్యాణ్ సినిమా అనగానే వివాదాలు వాటంతటవే ఎగేసుకుంటూ వచ్చేస్తాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్ని తొక్కేయడానికి ప్రభుత్వాలకి కొత్తగా నిబంధనలు గుర్తుకొచ్చేస్తాయి. ఇదిగో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారనగానే, దీనికి సంబంధించి జనసేన పార్టీ విడుదల చేసిన ప్రెస్ నోట్ మీద కూడా రివ్యూలు మొదలయ్యాయి. అభిమానులు ఆందోళన పడకూడదన్న కోణంలో విడుదల చేసిన ఫొటో మీద కూడా రివ్యూలు ఇచ్చేస్తున్నారు కొందరు.

ప్రెస్ నోట్ విడుదల చేయడం వెనుక రాజకీయ కోణం.. ఫొటో విడుదల చేయడం వెనుక రాజకీయ కోణం.. ఇలా చెత్త రివ్యూలు మొదలయ్యాయి. కరోనా బారిన పడ్డవారికి ఆక్సిజన్ అందకపోవడం అనేది అసలు సిసలు సమస్య. ఈ కారణంగానే, ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తారు. మరి, ఆ ఆక్సిజన్ పైపు మీద కూడా రివ్యూలు రాయడమేంటి ఛండాలం కాకపోతే.?

రామ్ చరణ్ కరోనా బారిన పడితే, ఇలాంటి ఫొటోలు రాలేదు. ఇంకో సెలబ్రిటీ కరోనా బారిన పడితే.. ఇలాంటి ఫొటోలు రాలేదు.. అన్నవారికి ఏం చెప్పగలం.? రాజశేఖర్ కరోనా బారిన పడ్డాడు.. కోలుకున్నాక కూడా కొద్ది రోజులపాటు ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ అందించాల్సి వచ్చింది.

బెడ్ మీద పవన్ కళ్యాణ్, పంచె కట్టుకుని పడుకోవడం గురించి కూడా చెత్త రివ్యూలు తెరపైకి తెస్తున్నారు. సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన వైద్య చికిత్స పొందుతుండడంపైనా రివ్యూల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వారెవ్వా.. పవన్ కళ్యాన్ మీద (Pawan Kalyan Covid 19 Positive and Negative Reviews) మరీ ఇంత ఫోకస్ అవసరమా.? అవసరమే.. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటేనే వాళ్ళందరికీ నోట్లో ముద్ద దిగుతుంది.. కంటికి నిద్ర పడుతుంది. దటీజ్ పవన్ కళ్యాణ్.

చివరగా.. కరోనా వైరస్ సంగతేమోగానీ, సమాజానికి.. అంతకన్నా ప్రమాదకరంగా మారుతున్నాయి ఇలాంటి రివ్యూలు. నెగెటివిటీ వుండొచ్చు.. మరీ ఇంత పైశాచికత్వమా.? కరోనా వైరస్ విషయంలో మందులు వాడిదే వ్యాధి నయమవుతుంది.. కానీ, ఈ పైశాచికత్వానికి మందు లేదు.

Digiqole Ad

Related post