Komalee Prasad Sasivadane.. కోమలీ ప్రసాద్.. డాక్టరు, ఆపై యాక్టరు కూడా.! నాని హీరోగా తెరకెక్కిన ‘హిట్-3’ సినిమాలో మహిళా పోలీస్ అధికారిగా కనిపించింది కోమలి.!
తన తాజా ‘శశివదనే’ సినిమా ప్రమోషన్లలో, మీడియా నుంచి ‘లిప్ లాక్ సీన్’ విషయమై ఓ ప్రశ్న ఎదురైంది కోమలీ ప్రసాద్‌కి.!
సాధారణంగా, ఇలాంటి ప్రశ్నలు అడగడానికి, ముందుగా సోకాల్డ్ ఎర్నలిస్టులు సిగ్గు పడాలి.!
కానీ, తెరపై, సిగ్గు లేకుండా నటీనటులు లిప్ లాక్ సీన్స్ లాగించేస్తోంటే, వాటి గురించి ప్రశ్నించడానికి తమకెందుకు సిగ్గు.? అన్నట్లు ఎర్నలిస్టులు కూడా ఓ అభిప్రాయానికొచ్చేశారు.
Komalee Prasad Sasivadane.. స్క్రిప్ట్ డిమాండ్.. ఓ పెద్ద జోక్.!
ఇక, మీడియా అడిగిన ప్రశ్నకు పెద్దగా తడుముకోలేదు కోమలీ ప్రసాద్. ‘ఈ రోజుల్లో స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్లే లిప్ లాక్ సీన్స్’ అనే మాట, జోక్ అయిపోయిందని చెప్పిందామె.

అంతలోనే, ‘ముందు, ఈ సీన్ అనుకున్నప్పుడు.. వద్దులే, అని అనుకున్నాం..’ అని సెలవిచ్చింది కోమలీ ప్రసాద్. అయితే, ఆ ‘లిప్ లాక్’ వెనుక పెద్ద కథ వుందని చెప్పుకొచ్చింది కోమలి.
హీరో, హీరోయిన్.. ఇద్దరూ కళ్ళతోనే ప్రేమించుకుంటారట. చాలా హృద్యంగా, అందంగా ఆ లిప్ లాక్‌ని తెరకెక్కించాలని టీమ్ డిసైడ్ అయ్యిందట.
కక్కుర్తి తప్ప.. లిప్ లాక్ సీన్స్ వల్ల ప్రయోజనమేంటి.?
థియేటర్స్‌కి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడకూడదనే కోణంలో, లిప్ లాక్ వద్దనుకున్నాంగానీ.. అంటూ, కోమలీ ప్రసాద్ సన్నాయి నొక్కులు నొక్కింది.
అయినా, లిప్ లాక్ సీన్స్ కోసం ఆడియన్స్ థియేటర్లకు వచ్చే పరిస్థితి వుంటుందా.? అసలు అలాంటి సీన్స్ దర్శకులు ఎందుకు తీస్తున్నట్లు.?
Also Read: ‘ఐ ఫోన్’ కోసం బిచ్చగాళ్ళైపోతున్నారెందుకు.?
నటీనటులెందుకు, లిప్ లాక్ సీన్స్ విషయమై అభ్యంతరం వ్యక్తం చేయడంలేదు.? అంటే, అదంతే.! లిప్ లాక్ సీన్స్ అంటే, అందులో కక్కుర్తి తప్ప ఇంకేమీ వుండదన్నది ఓ వాదన.

ఎవరి గోల వారిదే.! ‘Gen G’ ఆడియన్స్ కోసం లిప్ లాక్ సీన్స్.. అనే ఇంకో వాదనొకటుందనుకోండి.. అది వేరే చర్చ.
