Konidela Nagababu MLC.. సినీ నటుడు, నిర్మాత, జనసేన ముఖ్య నేత నాగబాబు, ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇటీవల నామినేషన్ వేయడం, ఏకగ్రీవంగా ఎన్నికవడం తెలిసిన విషయాలే.
తాజాగా, నేడు ఎమ్మెల్సీగా నాగబాబు పదవీ ప్రమాణం చేశారు. జనసేన పార్టీ నుంచి ఇప్పటికే ఓ ఎమ్మెల్సీ వుండగా, నాగబాబు చేరికతో జనసేన పార్టీ సంఖ్యాబలం శాసన మండలిలో ‘రెండు’కి పెరిగింది.
2024 ఎన్నికల్లో జనసేన పార్టీ (Jana Sena Party) పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ నియోజకవర్గాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
పొత్తులో భాగంగా, నాగబాబు తన ఎంపీ టిక్కెట్టుని త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో నాగబాబుని, కూటమి కోటాలో రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగినా, అనూహ్యంగా ఎమ్మెల్సీ సీటుని నాగబాబుకి కేటాయించారు.
Konidela Nagababu MLC.. ఎమ్మెల్సీ సరే.. మంత్రి పదవి ఎప్పుడో.!
కాగా, నాగబాబుని (Konidela Nagababu) తన మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు గతంలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.
ఎమ్మెల్సీ అయ్యాక, నాగబాబుకి మంత్రి పదవి వస్తుందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ కూడా ఓ సందర్భంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
నాగబాబు (Konidela Nagababu) ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణం చేసిన దరిమిలా, త్వరలోనే ఆయన మంత్రి వర్గంలోనూ చేరే అవకాశం వుంది.
తమ్ముడి గెలుపులో కీలక భూమిక..
ఇదిలా వుంటే, 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గంలో, ప్రచార బాధ్యతల్ని నాగబాబు తన భుజానికెత్తుకున్నారు.
Also Read: అక్కు పక్షీ.! విమానాల్ని ఎందుకు కూల్చేస్తున్నావ్.?
తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య నాగబాబు (Nagababu) పడ్డ కష్టం అంతా ఇంత కాదు.! మరోపక్క, పార్టీ నిర్మాణంలోనూ నాగబాబు కీలకంగా వ్యవహరించారు.
అంతకు ముందు.. అంటే, 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి నర్సాపురం లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేశారు నాగబాబు. కానీ, ఆ ఎన్నికల్లో నాగబాబు, ఓటమిని చవిచూశారు.