Konidela Varuntej Lavanya Tripathi.. తెలుగు తెరపైకి ‘అందాల రాక్షసి’గా దూసుకొచ్చింది. తొలి తెలుగు సినిమాతోనే మంచి విజయాన్ని కూడా అందుకుంది.!
స్టార్ హీరోయిన్ అనదగ్గ స్థాయికి వెళుతున్నట్టే వెళ్ళి.. రేసులో వెనకబడింది ఆ అందాల రాక్షసి.!
పరిచయం అక్కర్లేని పేరది. ఆమె ఎవరో కాదు, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi).!
Konidela Varuntej Lavanya Tripathi.. మెగా కాంపౌండ్‌లో అలా..
మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ (Konidela Varun Tej) హీరోగా నటించిన ‘మిస్టర్’ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

అదే వరుణ్ తేజ్‌తో (Konidela Varun Tej) ‘అంతరిక్షం 9000 KMPH’ సినిమాలోనూ నటించింది ఈ అందాల రాక్షసి (Andala Rakshasi).!
ఇక, మెగా కాంపౌండ్‌లోనే ‘సుప్రీం హీరో’ సాయి ధరమ్ తేజ్ (Supreme Hero Sai Dharam Tej) సరసన కూడా ఓ సినిమాలో నటించింది లావణ్య త్రిపాఠి. ఆ సినిమా పేరు ‘ఇంటెలిజెంట్’.
అన్నీ ఫ్లాపులే..
మెగా కాంపౌండ్‌లో లావణ్య త్రిపాఠి చేసిన మూడు సినిమాలూ ఫ్లాపులే. రెండైతే మరీ డిజాస్టర్లు.!! అల్లు శిరీష్ సరసన ఓ సినిమా చేసింది లావణ్య త్రిపాఠి. అది ‘శ్రీరస్తు శుభమస్తు’. ఈ సినిమా ఫర్వాలేదనిపించింది.

కానీ, ఈసారి మెగా కుటుంబంలోకి అడుగు పెడుతోంది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఔను, మెగా కోడలు కాబోతోంది. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ని పెళ్ళాడనుంది ఈ సొట్ట బుగ్గల భామ.
Also Read: Meera Jasmine.. రీ ఎంట్రీలో లక్కు ‘టెస్టు’ పాస్ అవుతుందా.?
ఇన్నాళ్ళూ ఇది గాసిప్ మాత్రమే. ఇప్పుడిది అధికారికం. జూన్ 9న లావణ్య – వరుణ్ తేజ్‌ల (Lavanya Tripathi Varun Tej) ఎంగేజ్మెంట్ జరగనుంది.
అన్నట్టు, లావణ్య ఇటీవల ‘హ్యాపీ బర్త్ డే’ అనే సినిమాలోనూ, ‘పులి మేక’ అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించిన సంగతి తెలిసిందే.