Table of Contents
Koratala Siva Tax Payer.. తాను ట్యాక్స్ పేయర్‌ని కాబట్టి, తనకు స్పెషల్ ట్రీట్మెంట్ కావాలంటున్నాడు ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ.
ప్రస్తుతం ‘దేవర’ సినిమా పనుల్లో బిజీగా వున్నాడు దర్శకుడు కొరటాల శివ. జూనియర్ ఎన్టీయార్ ఈ సినిమాలో హీరో. జాన్వీ కపూర్ హీరోయిన్.
ఒకప్పుడు కొరటాల శివ అంటే, సూపర్ హిట్ సినిమాల దర్శకుడు. కానీ, ‘ఆచార్య’ సినిమా తర్వాత, డిజాస్టర్ సినిమా దర్శకుడన్న ముద్ర వేయించుకున్నాడు.
Koratala Siva Tax Payer.. సక్సెస్, ఫెయిల్యూర్.. సహజమేగానీ..
సినిమాలు సక్సెస్ అవడం, ఫెయిల్యూర్ అవడం.. ఇవన్నీ సినీ రంగంలో సహజం. అయితే, ‘ఆచార్య’ విషయంలో మాత్రం దర్శకుడు కొరటాల శివ మీద తీవ్రాతి తీవ్రమైన విమర్శలు వచ్చాయ్.
సర్లేగానీ, టిక్కెట్ కొనుక్కుని.. దానికి సంబంధించిన ట్యాక్స్ కూడా కట్టే ప్రేక్షకుడికి.. థియేటర్లో సినిమా పరంగా నువ్విచ్చే ప్రివిలేజ్ ఏంటి కొరటాలా.? మంచి సినిమాలే తియ్యాలి కదా.? ప్రేక్షకుల్ని అస్సలు నిరాశపర్చకూడదు కదా.? క్యూ లైన్లలో వాళ్ళని నిలబెట్టకూడదు కదా.?
Mudra369
అంత ఛండాలంగా ఎలా సినిమా తీశావ్ కొరటాల.? అని, అతని అభిమానులే నిలదీసిన పరిస్థితి వచ్చింది. సరే, ఆ కారణాలేంటి.? అన్నది వేరే చర్చ.
మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు ‘దేవర’ సినిమాని ఎంచుకున్నాడు కొరటాల. సినిమాపై భారీ అంచనాలే వున్నాయ్.. అలాగే, అనుమానాలు కూడా.
ట్యాక్స్ పేయర్ అయితే మాత్రం..
కొన్నాళ్ళ క్రితం ఓ విమానాశ్రయానికి వెళ్ళాడట కొరటాల. అక్కడేమో, పెద్ద క్యూ లైన్ చూసి, తెలిసినవారి సాయంతో.. క్యూ లైన్ కాదని, నేరుగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడట.
దాంతో, అప్పటికే క్యూ లైన్లలో విసిగిపోయిన తోటి ప్రయాణీకులు, కొరటాలని నిలదీశారట. వారి మీద కొరటాల అరిచేశాడట కూడా.

తాను సెలబ్రిటీని కాబట్టి, తనకు కొన్ని ప్రివిలేజెస్ వుంటాయనీ, ఎప్పుడూ వాటిని తాను వినియోగించుకోలేదనీ, ఆ రోజు తన మూడ్ బాగోక.. అర్జెన్సీ కారణంగా ప్రివిలేజ్ వాడుకోవాలనుకున్నానని కొరటాల చెప్పాడు.
అందరూ ట్యాక్స్ పేయర్లే.!
అక్కడితో ఆగలేదు కొరటాల. ఏడాదికి నాలుగు కోట్లు ట్యాక్స్ కడుతున్న తనకు, స్పెషల్ ప్రివిలేజ్ లేకపోతే ఎలా.? అని కొరటాల ప్రశ్నించేశాడు. ఇదీ కామెడీ అంటే.!
దేశంలో ట్యాక్స్ కట్టని మనిషి వున్నాడా.? పొద్దున్న లేస్తే ఉపయోగించే బ్రష్ దగ్గర్నుంచి, రాత్రి పడుకునేటప్పుడు కప్పుకునే దుప్పటి వరకు.. అన్నిటి మీదా పన్నులే.
Also Read: సింగిల్ సింహం.! ఎంత నిజం.?
సామాన్యుడు పన్నులు కట్టని రోజంటూ ఏదీ వుండదు.! పుట్టిన దగ్గర్నుంచి చచ్చే దాకా పన్నులు కట్టి తీరాల్సిందే.
ఇవన్నీ కొరటాలకి తెలియవా.? తెలిసీ ‘మేతావి’తనం ఎందుకు ప్రదర్శించినట్లు.?