Krithi Shetty Crying.. ఏడ్చే మగాడ్ని, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని వెనకటికి పెద్దలు చెప్పిన మాట. అంటే, నవ్వే మగాడ్ని నమ్మొచ్చు.. ఏడ్చే ఆడదాన్నీ నమ్మొచ్చన్నమాట.! అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు.. విశ్లేషిస్తే ఇలాగే వుంటుంది.
ఒకప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఒకప్పుడైతే సతీ సహగమనం ఓ ఆచారం. అది దురాచారమని ఆ తర్వాత దాన్ని రద్దు చేసుకున్న సమాజం మనది.
చెప్పుకుంటూ పోతే, ఇలాంటివి చాలానే కనిపిస్తాయి. ఇంతకీ, ఏది రైటు.? ఏది రాంగ్.? ఇది మళ్ళీ మిలియన్ డాలర్ క్వశ్చన్ అయి కూర్చుంటుంది. ఏ విషయంలో అయినా, చర్చ ఇలాగే రచ్చ రచ్చ అయిపోతుంటుంది. మాయదారి కాలమిది.!
Krithi Shetty Crying.. పాపా.. ఎందుకు ఏడ్చావ్.?
‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి ఈ మధ్యన ఏడ్చింది.? ఏం, ఆమె గతంలో ఏడవలేదా.? అంటే, అది వేరే కథ. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కృతి శెట్టి ఏడ్చింది.. అదీ అసలు సంగతి.
Also Read: సిత్తరమ్.. స్పైసీ ‘క్యాండీ పాప’ గుట్టు ‘విప్ప’గలరా.?
ఔనా.? మొన్నామధ్య నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా ఏడ్చింది కదా.? అంటే, అది వేరే కథ. ఆమె మీద విపరీతమైన అభిమానంతో అభిమానులు గోల చేస్తోంటే, పట్టరాని ఆనందంతో ఆమె ఏడ్చేసింది.
ఇంతకీ, కృతి శెట్టి ఎందుకు ఏడ్చిందో తెలుసా.? ఓ ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో ‘ప్రాంక్’ చేసినందుకు. గట్టి గట్టిగా అక్కడున్న వ్యక్తులు అరిచేసుకున్నారట. దాంతో కృతి శెట్టికి ఏడుపొచ్చేసిందట. అదన్నమాట అసలు సంగతి.

మరీ అంత సున్నితమైతే ఎలా పాపా.? అని ప్రశ్నిస్తే, ‘నేను అంతే.. ఎవరన్నా గట్టిగా గొడవ పడుతోంటే నాకు భయమేస్తుంది.. ఏడ్చేస్తాను..’ అని చెప్పింది కృతి శెట్టి.
సినీ రంగంలో చీవాట్లు ఎదురైతే ఏంటి పరిస్థితి.?
సినిమా రంగం పైకి కనిపించేంత సున్నితంగా వుండదు. దర్శకుడు తేజ అయితే నటీనటుల్ని కొడతాడనే పేరు సంపాదించుకున్నాడు.
కృతి శెట్టిని కూడా ఓ దర్శకుడు గట్టిగా తిట్టాడట.. చెయ్యి చేసుకున్నాడనే ప్రచారమూ జరిగింది. ఆ తర్వాత అదంతా తూచ్ అనేశారనుకోండి.. అది వేరే మేటర్.
Also Read: అనసూయ ఆన్‌లైన్ ‘ఆట’.. ఆడండి, నాశనమైపోండి.!
ఇంతకీ, కృతి శెట్టి ఏడుపు నిజమేనా.? ఏడ్చే ఆడదాన్ని నమ్మకూడదని పెద్దలేమీ చెప్పలేదు గనుక, నమ్మేయొచ్చేమో. సాయి పల్లవి కూడా గతంలో ఏడ్చింది కదా.? ఆమె ఏడుపు కూడా నిజమైనదేనేమో.!
సినీ నటులు అయినా, వాళ్ళూ మనుషులే కదా.? వాళ్ళకీ ‘మానసిక సున్నితత్వం’ వుంటుంది కదా.! అదండీ అసలు విషయం.