Krithi Shetty Talent.. ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి బాగా మారిపోయింది. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు రావడం.. బేబమ్మలో కొన్ని కీలకమైన మార్పులకు కారణమయ్యాయనిపిస్తోంది.
ముఖ్యంగా గ్లామర్ విషయంలో బేబమ్మ ఆలోచనలు మారిపోయాయనిపిస్తోంది. అందుకు తాజాగా సోషల్ మీడియాలో బేబమ్మ గ్లామర్ పర్పామెన్సే కారణమని అర్ధమవుతోంది.
కృతి శెట్టిలో మంచి నటి దాగుంది. అందులో నో డౌట్. ఎలాంటి బరువైన పాత్రయినా కాస్త సాన పట్టిస్తే బేబమ్మ ఈజీగా హ్యాండిల్ చేసేయగలదు.
Krithi Shetty Talent.. వాడకం మామూలుగా లేదుగా..
అయితే, ఆమె ఎంచుకునే పాత్రలే ఆమె కెరీర్‌ని డ్యామేజ్ చేస్తున్నాయన్న అభిప్రాయాలు కొంత మేర వున్నప్పటికీ దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సిద్ధాంతాన్ని కృతి శెట్టి ఫాలో అయిపోయినట్లుంది.
అందుకే వచ్చిన ప్రతీ అవకాశాన్నీ వాడేసుకోవాలనుకుంది. ఆ తొందరపాటే అమ్మడి కొంప ముంచేసింది. స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన కృతి శెట్టి కెరీర్ డౌన్ ఫాల్ అవుతూ వస్తోంది.

ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో కొత్తగా చేయాల్సిన ప్రాజెక్టులేమీ లేవు. దాంతో, ఖాళీగా వున్న ఈ టైమ్‌ని తనలోని నెక్స్ట్ లెవల్ గ్లామర్ టాలెంట్‌ని బయటికి తీసేందుకు వాడేస్తోంది.
హాట్ హాటర్ హటెస్ట్..
ఇంతవరకూ లిమిటెడ్ వెర్షన్ గ్లామర్ అప్పియరెన్స్ మాత్రమే చూపించిన బేబమ్మ, తాజాగా హద్దులు మీరిన గ్లామర్ డోస్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
Also Read: బండ్ల సలహా.! గురూజీకి గిఫ్టు కొట్టు.! నిర్మాతగా ఛాన్సు పట్టు.!
డీప్ నెక్ డ్రెస్‌లో హాటెస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఓ స్పెషల్ ఫోటో షూట్ చేయించుకుని నెట్టింట వదిలేసింది బేబమ్మ. ఇంకేముంది.. బేబమ్మ హద్దులు మీరిన ఆ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాని చుట్టేస్తున్నాయ్.

నెటిజన్లను హుషారెత్తిస్తున్నాయ్. ఈ పిక్స్‌లోని కృతి శెట్టి గ్లామర్ యాంగిల్స్కి, ఈ మధ్య అనూహ్యంగా వచ్చేసిన ఐరెన్ లెగ్ ఇమేజ్ కాస్తా స్కిప్ అయిపోయి మళ్లీ ఆఫర్లు క్యూ కట్టేస్తాయేమో చూడాలి మరి.