హిట్టొస్తే కెరీర్ అదిరిపోతుంది.. అదే ఫ్లాపొస్తే అంతే సంగతులు. హీరోలకంటే ఈ విషయంలో హీరోయిన్లకే కష్టాలెక్కువ. పొడుగు కాళ్ళ సుందరి కృతి సనన్ (Kriti Sanon A Fighter Woman) కూడా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసేసింది. తెలుగులో ఆమెకి తొలి సినిమా సూపర్ స్టార్ మహేష్ నటించిన ‘1 నేనొక్కడినే’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది.
తొలి సినిమా ‘1 నేనొక్కడినే’ (1 Nenokkadine Super Star Maheshbabu) ఫ్లాపయితేనేం, తర్వాతి సినిమాలతో నిలదొక్కుకుంటానని అనుకుందిగానీ, ఆమెకి తెలుగులో చేసిన రెండో సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. అదే, ‘దోచెయ్’ (Dochay). అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా నటించిన సినిమా ఇది. తెలుగులో తొలి రెండు సినిమాలూ ఫ్లాపవడంతో, ఆమెను తెలుగు సినిమా పరిశ్రమ దూరం పెట్టేసింది.
ఐరన్ లెగ్.. అలా ముద్ర పడిపోయింది
‘ఐరన్ లెగ్’ అనే ముద్ర కృతి సనన్ (Kriti Sanon Hot) తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా, హిందీ సినీ పరిశ్రమలో కూడా వేయించేసుకుంది. కాదు కాదు.. ఆమె మీద కొందరు బలవంతంగా ఆ ఇమేజ్‌ని రుద్దేశారు. అక్కడా ఆమెకు అలాంటి ఫ్లాపులొచ్చాయ్ మరి. ఓ నటి అయితే, తన స్థాయిని దిగజార్చేసుకుని మరీ కృతి సనన్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
కృతి సనన్ (Kriti Sanon) మీద బాడీ షేమింగ్‌కి దిగిన ఆ నటి, ‘హెడ్ లైట్స్ లేవు.. బంపర్ కూడా లేదు..’ అంటూ ఎద్దేవా చేసింది. హెడ్ లైట్స్ అంటే ఇక్కడ ఎద యెత్తులన్నమాట. బంపర్ అంటే, పిరుదులన్నది సదరు నటి ఉద్దేశ్యం. సాటి మహిళను అలా అనడానికి ఆ నటికి అస్సలేమాత్రం సిగ్గు లేకుండా పోయింది.
అవమానాల్ని భరించి.. హీరోయిన్‌గా సత్తా చాటి..
ఇలా చాలా అవమానాల్ని భరించిన కృతి సనన్ (Kriti Sanon Spicy) దశ తిరిగింది అనూహ్యంగా. ‘లుకా చుప్పీ’ (Luka Chuppi) తదితర సినిమాలతో హిట్టు ట్రాక్ ఎక్కేసింది కృతి సనన్ బండి. ఇప్పడామె హిందీలో స్టార్ హీరోయిన్. మన ప్రభాస్ (Pan India Super Rebel Star Prabhas) సరసన కూడా ఓ పాన్ ఇండియా సినిమా చేసేస్తోంది.
గ్లామర్ ఒలకబోసే సినిమాలతోపాటు, నటకు ప్రాధాన్యత వున్న సినిమాల్నీ ఎంచుకుంటూ దూసుకుపోతోంది కృతి సనన్ (Kriti Sanon A Fighter Woman). ఈ కోవలోనే కృతి నటించిన మరో సినిమా ‘మిమి’. సరోగసీ (అద్దె గర్భం) నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘మిమి’ (Mimi Movie).