Table of Contents
సరోగసి.. అద్దె గర్భం మన దేశంలో గత కొంత కాలంగా ఈ మాట తరచూ వింటున్నాం. పలువురు సినీ ప్రముఖులు సరోగసీ ద్వారా తల్లిదండ్రులవుతున్నారు. అలా ఈ సరోగసీకి పాపులారిటీ బాగా పెరిగింది. అందుకే సరోగసీ చుట్టూ సినిమాలు కూడా పెరుగుతున్నాయ్. అలా వచ్చిన తాజా సినిమా ‘మిమి’ (Kriti Sanon MIMI Movie Review In Telugu) సంగతులేంటో తెలుసుకుందాం.
హెడ్ లైట్లు లేవు.. బంపర్లు లేవు.. అంటూ ఓ నటి, తన తోటి నటిపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసింది. అక్కడ బాధితురాలైన ఆ నటి పేరు కృతి సనన్. సాటి మహిళ తనను బాడీ షేమింగ్ చేయడంపై ఆవేదన చెందిన కృతి సనన్, ఆ ఆవేదన నుండి త్వరగానే కోలుకుంది. బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడితే, అంత పైకి ఎగురుతుంది.
Also Read: సినిమా రివ్యూ.. ‘వకీల్ సాబ్’.. ది పవర్ కింగ్.!
దాన్నే కృతి సనన్ (Kriti Sanon) ఆదర్శంగా తీసుకున్నట్లుంది. సినిమా సినిమాకీ నటిగా ఓ మెట్టు పైకి ఎక్కుతోంది. ఈ క్రమంలో ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చకుంటోంది కృతి సనన్. అలా కృతి సనన్ ఎంచుకున్న ఓ ప్రత్యేకమైన పాత్ర పేరే ‘మిమి’ సినిమాలోని మిమి రాథోడ్.
కథ ఏంటంటే..
స్వతహాగా డాన్సర్ అయిన మిమి నటిగా ఎదగాలనుకుంటుంది. ఈ క్రమంలో ఆమెను ఆర్ధిక ఇబ్బందులు వేధిస్తాయి. డ్రైవర్ భాను ప్రతాప్ పాండే (పంకజ్ త్రిపాఠి) ద్వారా సరోగసీ ఆఫర్ ఆమెకు వస్తుంది. తొలుత ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తుంది.
కానీ, పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటూ అమెరికన్ జంట ముందుకు రావడంతో తన గర్భాన్ని అద్దెకు ఇచ్చేందుకూ, నవ మాసాలు వారి బిడ్డను తన కడుపులో పెంచేందుకు మిమి ఒప్పుకుంటుంది. కానీ, చివరి నిముషంలో ఆ అమెరికన్ జంట మిమి కడుపులో పెరుగుతున్న బిడ్డ తమకు అవసరం లేదని చెబుతుంది. ఆ తర్వాత మిమి పరిస్థితేంటీ.? తెరపై చూడాల్సిందే.
Also Read: Ek Mini Katha Review.. చిన్నదేగానీ, చాలా పెద్దది.!
చాలా భావోద్వేగభరితమైన కథాంశమిది. దాన్ని దర్శకుడు లక్ష్మణ్ ఉత్కర్ కాస్తంత కామెడీ డోస్‌తో ఆధ్యంతం అత్యద్భుతంగా మలచేందుకు ప్రయత్నించాడు. మొదటి అర్ధభాగం సరదా సన్నివేశాలతో సజావుగానే సాగిపోతుంది. సెకండాఫ్‌లో ఎమోషన్ కాస్త పెరుగుతుంది.
నవ్వించింది.. ఆలోచింపజేసింది.. Kriti Sanon MIMI Movie Review In Telugu
ఇటు కామెడీ పండించే సన్నివేశాల్లోనూ, అటు ఎమోషన్ రక్తి కట్టించే సన్నివేశాల్లోనూ కృతి సనన్, మిమి పాత్రలో ఒదిగిపోయింది. తెరపై మిమి మాత్రమే కనిపిస్తుంది. దానర్ధం మిమి పాత్రలో కృతి జీవించేసిందని. ఆమెకి సపోర్టింగ్ రోల్ చేసిన పంకజ్ త్రిపాఠి చాలా బాగా చేశాడు.
నిజానికి ఇలాంటి కథల్ని ఎంచుకోవడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి హీరోయిన్లకు. అయితే, కృతి మాత్రం దీన్నొక సవాల్‌గా తీసుకుంది. గర్భిణిగా కనిపించడం కోసం 15 కిలోలు పైనే బరువు పెరగింది. నటిగా ఇప్పటి వరకూ తాను చేసిన సినిమాలన్నింట్లోకీ ఇది చాలా ప్రత్యేకమైన సినిమా అని, సినిమా రిలీజ్‌కి ముందు చెప్పడమే కాదు.. అవును అది నిజమే.. అని ప్రేక్షుకులు ఒప్పుకునేలా చేయగలిగింది. మామూలుగా వన్ మ్యాన్ షో అంటాం. కానీ, ఇది వన్ ఉమెన్ షో.
Also Read: సినిమా రివ్యూ: నారప్ప.. వెంకటేష్ నట విశ్వరూపం.!
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు అదనపు అందాన్ని తెచ్చింది. సినిమాలో లీనమైపోయేలా సన్నివేశాలతో కనెక్ట్ అయ్యేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, ఎక్కడ, ఏ సన్నివేశం ఎలా ఎలివేట్ అవ్వాలో అలా ఎలివేట్ చేయడంలో దర్శకుడికి సినిమాటోగ్రఫీ నుండి పూర్తి సహకారం లభించింది.
మాటలు సరదాగా ఉన్నాయి. మనసుల్ని తాకాయి. కాస్త ఎమోషన్‌కి గురి చేశాయి కూడా. సినిమా నిడివి ఇంకాస్త తగ్గితే ఇంకా బావుండేది అనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది.. అంటే ఎడిటింగ్ విభాగం ఇంకాస్త పదునుతో కొన్ని సన్నివేశాల నిడివికి కత్తర వేసి ఉండాల్సింది.
కాటు వేసిన కరోనా..
కరోనా కాటు కారణంగా ఈ సినిమా ఓటీటీకి పరిమితమైంది. మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్టు, ఓటీటీకి ముందే, హెచ్ డీ క్వాలిటీతో ‘మిమి’ లీకైపోవడం అత్యంత బాధాకరం. చివరిగా, కృతి సనన్ (Kriti Sanon MIMI Movie Review In Telugu) ఇకపై విలక్షణ కథాంశాలతో సినిమాలు తీసే వారికి బెస్ట్ ఆప్షన్.