బిగ్ బాస్ రియాల్టీ షో నాలుగో సీజన్.. అంతా ప్లాన్ ప్రకారమే నడుస్తోంది. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ముందే తెలిసిపోతోంది. వీకెండ్ నాగ్ ఎంట్రీ సాంగ్‌తో సహా, అన్ని వివరాలూ ముందే (Kumar Sai Elimination Secret) బయటకొచ్చేస్తున్నాయి.
నామినేషన్స్ ఎపిసోడ్ ముగిసిన వెంటనే, ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారనేదానిపై ఓ ఐడియా వచ్చేస్తోంది అందరికీ. ఎందుకిలా? ఈ వీక్ కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తి కుమార్ సాయి.
చిత్రంగా, ప్రతిసారీ గట్టెక్కేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే అతనిలో ఎనర్జీ బయటపడిందో.. ఆ వెంటనే, అతన్ని హౌస్ నుంచి బయటకు లాగేశారు. ఈ వీక్ ఎలిమినేషన్‌కి గురవ్వాల్సిన వ్యక్తుల్లో కుమార్ సాయి పేరు అసలు లేనే లేదన్నది చాలామంది బిగ్‌బాస్ వ్యూయర్స్ వాదన.
తక్కువ ఓట్లు వచ్చినవారిలో కుమార్ సాయి బెటర్ పొజిషన్‌లోనే వున్నాడట. మోనాల్ గజ్జర్ పరిస్థితి దారుణంగా వుందనీ, లిస్ట్‌లో అఖిల్ కూడా వున్నాడనీ, అరియానా పేరు కూడా తక్కువ ఓట్ల లిస్ట్‌లో వుందనీ ప్రచారం జరుగుతోంది.
మోనాల్‌ని ఎలిమినేట్ చేయాలనుకున్నా, ఆమె హౌస్‌కి కావాల్సినంత హాట్ స్టఫ్’ అందిస్తోంది. పైగా, ఎమోషన్ యాంగిల్‌లో చూసుకుంటే ఆమెకు సాటి ఎవరూ రారు. ఇంకోపక్క ఆమెతో పులిహోర కలిపేందుకు అఖిల్ వుండనే వున్నాడు.
ఈ కారణంగానే, ఈ జోడీని విడగొట్టడం ఇష్టం లేక.. నిర్వాహకులు కుమార్ సాయి మీద అనవసరంగా ‘వేటు’ వేశారనే ప్రచారం జరుగుతోంది. నిజమేనా? ఇలాక్కూడా జరుగుతుందా? అంటే, దేవి నాగవల్లి ఎలిమినేషన్‌తోనే అందరికీ ఓ ఐడియా వచ్చేసింది ఎలిమినేషన్ ప్రక్రియ ఎంత గొప్పగా జరుగుతుందో.!
ఎలిమినేట్ అవుతున్నానని తెలిసీ కుమార్ (Kumar Sai Elimination Secret) చాలా కాన్ఫిడెంట్‌గా కన్పించాడు. అస్సలేమాత్రం ఓవరాక్షన్ చెయ్యలేదు. స్టేజ్ మీద నాగ్ ఏదో టాస్క్ ఇస్తే, అందులో ‘కరివేపాకు’ చూపించి, అఖిల్ పేరు చెప్పాడు. దాన్ని ‘ఫన్’ అనే యాంగిల్‌లో అఖిల్ తీసుకోలేకపోవడం గమనార్హం.
మోనాల్ ఎలిమినేట్ అవుతుందేమోనని తెగ భయపడిపోయాడు అఖిల్. అతని వీక్‌నెస్ ఏంటన్నది ఇక్కడ అర్థమయిపోయింది. ఓవరాల్‌గా కుమార్ సాయి ఎలిమినేషన్ చాలామందికి నచ్చలేదు. ‘మెజార్టీ వ్యూయర్స్’కి నచ్చలేదంటే, అతనికి ఓట్లు బాగానే పడి వుండాలి కదా.!