Kumbhmela Monalisa Minor.. కుంభమేళా మోనాలిసా తెలుసు కదా.? తెలియకపోవడమేంటి, రాత్రికి రాత్రి స్టార్‌డమ్ సంపాదించేసుకుంటేను.!
ఓ సాధారణ యువతి.. అందునా, పూసలమ్ముకునే యువతి.. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల కారణంగా ‘స్టార్’ అయిపోయింది.
మోనాలిసాతో ఇంటర్వ్యూల కోసం యూ ట్యూబర్లు మాత్రమే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎగబడింది. ఇకనేం, పెద్ద సెలబ్రిటీ అయిపోయింది మోనాలిసా.
కొన్ని సినిమాల్లోనూ మోనాలిసాకి అవకాశాలొచ్చాయ్. వాటిల్లో కొన్ని నిర్మాణ దశలో వున్నాయి. తెలుగులోనూ మోనాలిసాతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.
Kumbhmela Monalisa Minor.. సినిమాలు.. లవ్ జిహాద్.. పోక్సో..
ఈ మధ్యనే హైద్రాబాద్ వచ్చి, సదరు సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొని, వచ్చీరాని తెలుగులో నాలుగు మాటలు మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది మోనాలిసా.
అలాంటి మోనాలిసా, అందరికీ షాక్ ఇస్తూ, పెళ్ళి చేసేసుకుంది. సోషల్ మీడియా వేదికగా పరిచయమైన ఓ యువకుడితో పెళ్ళి, ఆ పెళ్ళిపై లవ్ జిహాద్ ఆరోపణలు.. ఇదంతా ఓ ప్రసహనం.
కేరళకు చెందిన యువకుడిని పెళ్ళాడింది మోనాలిసా. ఇద్దరికీ వయసు గ్యాప్ కూడా ఎక్కువే. తల్లిదండ్రుల నుంచి ప్రాణ హాని వుందంటూ మోనాలిసా, పోలీసుల్ని ఆశ్రయించింది కూడా.
Also Read: ‘కపుల్ ఫ్రెండ్లీ’ సమీక్ష.! లిప్ లాక్స్ అవసరం లేదు కదా.!
మరోపక్క, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ జరిపిన విచారణలో, మోనాలిసా మైనర్ అని తేలడంతో, కేసు కొత్త మలుపు తిరిగింది. మోనాలిసా భర్త మీద ‘పోక్సో’ చట్టం కింద కేసు నమోదయ్యింది.
మోనాలిసా మైనర్ కావడంతో, ఆమె పెళ్ళి చెల్లకుండా పోయిందిప్పుడు. రేపో మాపో మోనాలిసా భర్తని అరెస్ట్ చేయడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది.
ట్విస్టు మీద ట్విస్టు అంటే ఇదే మరి.! ఎలా స్టార్‌డమ్ వచ్చిందో, అలా ఆ స్టార్‌డమ్ కాలగర్భంలో కలిసిపోయేలా వుంది మోనాలిసాకి.!
