Table of Contents
Kushi Movie Review Rating.. అమ్ముడుపోవడం తప్పా.? కొనుక్కోవడం తప్పా.? తప్పేముంది.. ఇది యాపారం.! ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోవాలె.!
ఏ సినిమా రిలీజ్ అయినా, ఇటీవలి కాలంలో ఆ సినిమా రివ్యూలకు సంబంధించి, ‘అమ్మకాలు – కొనుగోళ్ళు’ అన్న చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
తాజాగా, ‘ఖుషీ’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విడుదలకు ముందే, సూపర్ హిట్ బజ్ రావడానికి కారణమేంటి.?
Kushi Movie Review Rating.. కాంబినేషన్ అలాంటిది..
విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్.. పైగా, శివ నిర్వాణ దర్శకుడు.! పాటలు బావున్నాయ్. ప్రోమోస్ ఇంట్రెస్టింగ్‌గా వున్నాయ్.. సో, హైప్ రావడం సహజమే.

కానీ, బొమ్మ థియేటర్లలో పడేసరికి, సీన్ మారింది.! డిజాస్టర్ అన్న టాక్ స్ప్రెడ్ అయ్యింది. అదే సమయంలో, సూపర్ హిట్.. అన్న ప్రచారమూ గట్టిగా సాగింది.
మంచి ఓపెనింగ్స్ మాత్రం వచ్చాయన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. అయితే, ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో, ఉదయం 11 గంటల ఆటకి, థియేటర్లో సగం మంది కూడా కనిపించలేదు.! ఎందుకిలా.?
అమ్మేసుకున్నారట..
సినిమా టాక్ ఎలా వున్నా, రేటింగు మాత్రం మూడుకి పైనే పడిపోవాలంటూ చిత్ర నిర్మాణ సంస్థ ప్రయత్నించిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘మమ్మల్నీ అడిగారుగానీ, రేటు సెట్టవలేదు..’ అంటూ ఓ వెబ్‌సైట్ ప్రతినిథులు చర్చించుకోవడం జరిగింది. ఇలాక్కూడా జరుగుతుందా.? అని చాలామంది ముక్కున వేలేసుకోవచ్చుగాక.
‘వాళ్ళకి పెద్ద అమౌంట్ కోట్ చేశారు.. అలా డీల్ క్లోజ్ అయ్యింది. అందుకే, మూడుంపావలా రేటింగ్ పడింది..’ అంటూ ఓ ప్రముఖ వెబ్ సైట్ రేటింగుపై చర్చ సినీ మీడియా వర్గాల్లో నడిచింది.
‘అబ్బే, సినిమాలో అంత లేదు.. ఒకటిన్నర కంటే రేటింగ్ దండగ..’ అని చెప్పిన వ్యక్తి, తన రివ్యూకి రేటింగ్ మాత్రం రెండున్నర ఇచ్చాడు. ఏంటీ మతలబు.?
అసలేం జరుగుతోంది.?
సినిమాపై దుష్ప్రచారంలో భాగంగానే ఇలా సినీ మీడియా జనాలు చర్చించుకుంటున్నారా.? నిజంగానే, రేటింగుల్ని కొనేసే వ్యవహారాలు నడుస్తున్నాయా.?
Also Read: అరరె.! నయనతార ఇలా చేసిందేంటీ.!
రేటింగుల్ని అమ్ముకుంటున్నవాళ్ళున్నప్పుడు.. కొనుక్కునే ప్రయత్నాలు జరిగితే జరగొచ్చుగాక.! లేదంటే, నిర్మాణ సంస్థల్ని బ్యాడ్ చేయాలన్న కుట్ర కోణం కూడా ఇందులో దాగి వుండొచ్చేమో.!
తిన్నింటి వాసాలు లెక్కెట్టడం.. అనేదొకటి వుంటుంది కదా ఎప్పుడూ.! అన్నట్టు.. రేటింగుల కొనుగోళ్ళు అమ్మకాలు.. వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు నడుస్తున్నాయట.. ఆయా వెబ్‌సైట్ల స్థాయిని బట్టి.!