Home » సిల్వర్ ఏంజెల్.! నిధి అగర్వాల్ గ్లామర్ మెరుపుల్.!

సిల్వర్ ఏంజెల్.! నిధి అగర్వాల్ గ్లామర్ మెరుపుల్.!

by Mudra369 Editorial Desk
0 comments
Nidhhi Agerwal

Nidhhi Agerwal Silver Angel.. ఫ్యాషన్ రంగంలో ఎప్పటికప్పుడు తనదైన ఫ్యాషన్ సెన్స్‌తో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంటుంది అందాల భామ నిధి అగర్వాల్.

అరే.! నిధి అగర్వాల్ కెరీర్ అయిపోయిందే అనుకున్న టైమ్‌లో ‘పవర్’ ఛాన్స్ దక్కించుకుంది ‘హరి హర వీరమల్లు’ సినిమాతో.

ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేసి వావ్.! అనిపించుకుంది. ఇక అప్పటి నుంచీ మళ్లీ రీ యాక్టివ్ అయ్యింది నిధి అగర్వాల్.

ఆ తర్వాత ‘ది రాజా సాబ్’ సినిమాలో తనదైన గ్లామర్‌తో కుర్రోళ్ల మనసులు కొల్లగొట్టేసింది.

ప్రస్తుతం ఒక ప్రెస్టీజియస్ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో భాగమైంది. అలాగే మరికొన్ని విలక్షణమైన కథలను వినే పనిలో బిజీగా వున్నట్లు సమాచారం.

ఆ సంగతి పక్కన పెడితే, డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయడంలో నిధి అగర్వాల్ ఎప్పుడూ ముందుంటుంది.

అలాగే, ఫ్యూచర్ ప్రాజెక్టుల్ని దక్కించుకునే దిశగా గ్లామరస్ స్పెషల్ ఫోటో షూట్స్ చేయించుకోవడంలోనూ నిధి అగర్వాల్‌కి మంచి టేస్ట్ వుంది.

Nidhhi Agerwal Silver Angel.. రెడ్ కార్పెట్ లుక్స్‌లో నిధి అగర్వాల్ సిల్వర్ మెరుపుల్.!

అలా లేటెస్ట్‌గా సిల్వర్ కలర్ ఫ్రాక్‌లో డిఫరెంట్‌గా చేయించుకున్న ఫోటో షూట్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది నెట్టింట.

నిధి అగర్వాల్ ఈ లుక్‌లో మెయిన్ అట్రాక్షన్.. ఆమె ధరించిన సిల్వర్ అండ్ వైట్ బాడీ కాన్ మినీ డ్రస్. ఈ డ్రస్ నిండా సీక్వెన్స్ అండ్ చెమ్కీలు పొదిగి వుండడంతో షైన్ షైన్ వైబ్ క్రియేట్ అవుతోంది.

అలాగే భుజాల మీద నుంచి ఫాలింగ్ అయ్యేలా రూపొందించిన పఫ్ డిజైన్ ఫ్రాక్ అందాన్ని మరింత పెంచేసింది. హై నెక్ అనిపించేలా సేమ్ నెట్ ఫ్యాబ్రిక్ దానితోనే యాడ్ అయిన నెక్ వర్క్.. నెక్లెస్ లుక్ తలపిస్తోంది.

దాంతో ఫుల్‌గా యాక్సెసరీస్ అవసరమే లేదీ డ్రస్‌కి. కంప్లీట్ హెవీ జ్యుయలరీ లుక్ యాడ్ అయిపోయింది.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

దాంతో పాటూ, డ్రస్‌కి రెండు వైపులా భుజాల నుంచి ఫాల్ అవుతున్న ట్రాన్స్‌పరెంట్ వైట్ ఆర్గంజా కేప్ ఈ లుక్‌కి సినిమాటిక్ ఎఫెక్ట్ ఇస్తోంది.

ఈ డ్రస్ మొత్తానికి కాంట్రాస్ట్‌గా డిజైన్ చేసిన డార్క్ రెడ్ బ్యాక్ డ్రాప్‌లో నిధి అగర్వాల్ ఓ ఏంజెల్‌లా గాల్లో తేలుతోందా.! అన్న అభిప్రాయం వచ్చేలా చేస్తోంది.

హెవీ డ్రస్ డిజైన్‌కి హెయిర్ స్టైల్ అండ్ ఫేస్ మేకప్ అంతా సింపుల్‌గా డిజైన్ చేయడంతో ఎక్కడా వంక పెట్టడానికి లేదనేలా రెడ్ కార్పెట్ లుక్స్‌లో ఫోకస్ మొత్తం తన వైపే తిప్పేసుకుంటోంది ఏంజెల్ నిధి అగర్వాల్.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group