పేరులోనే లావణ్యం.. కాస్త తేడా డైలాగులు పేల్చితే, ఎలా షాక్ ఇవ్వాలో అలా ఇచ్చేస్తుంటుంది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. కొన్నాళ్ళ క్రితం సోషల్ మీడియాలో ఓ గ్లామరస్ ఫొటో పెడితే, దానికి ఓ నెటిజన్ కొంటెగా సెటైరేస్తే, మైండ్ బ్లాంక్ అయ్యేలా రిటార్ట్ (Lavanya Tripathi Covid 19 Help) ఇచ్చింది. అప్పట్లో ఆ వ్యవహారం ఓ పెద్ద సంచలనం.
ఇక, తాజాగా ఓ నెటిజన్.. కరోనా నేపథ్యంలో మీ సెలబ్రిటీలంతా ఏం చేస్తున్నారు.? అంటూ లావణ్య త్రిపాఠిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ వెటకారం చేశాడు. దానికి లావణ్య త్రిపాఠి తనదైన స్టయిల్లో స్పందించింది. ‘నేనేం చేస్తున్నానో.. అది ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది నాకిష్టముండదు..’ అంటూ రిటార్ట్ ఇచ్చింది లావణ్య.
కొందరు తాము చేసిన సాయం గురించి చెప్పుకుంటుంటారు. కొందరు సాయం చేసినా చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎవరి ఇష్టం వారిది. సాయం చేస్తున్న విషయాన్ని చెప్పుకోవడం సొంత పబ్లిసిటీ అనుకుంటే పొరపాటు. అలా పది మందికి స్ఫూర్తినివ్వడానికి సెలబ్రిటీలు ఆ మార్గాన్ని ఎంచుకుంటారు.
కరోనా కష్ట కాలంలో సినీ పరిశ్రమ నుంచి చాలామంది చాలా విధాలుగా స్పందిస్తున్నారు. నిజానికి, సినిమా అనేది ఓ ప్రొఫెషన్.. మీరెందుకు సాయం చేయలేదు.? అని సినీ ప్రముఖుల్ని ప్రశ్నించడంలో అర్థమే లేదు. పరిశ్రమ తరఫున, వ్యక్తిగతంగా.. సినీ పరిశ్రమ నుంచి కరోనా విషయంలోనే కాదు, వరదలొచ్చినా.. తుపాన్లొచ్చినా సాయం అవసరమైనవారికి అందుతూనే (Lavanya Tripathi Covid 19 Help) వుంటోంది.