Lavanya Tripathi Konidela Tollywood.. ఫొటోలో వున్నదెవరో తెలుసు కదా.! అందాల రాక్షసి.! అదేనండీ, లావణ్య త్రిపాఠి.! ఇప్పుడేమో ఆమె మెగా కోడలిగా మారింది.!
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ (Varun Tej Konidela) భార్యగా మారింది అందాల భామ లావణ్య త్రిపాఠి.
లావణ్య – వరుణ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.! ‘ప్రేమా.? గీమా.?’ అంటూ మొదట్లో మీడియా ప్రశ్నలకు తమదైన సెటైర్లేసిన ఈ ఇద్దరూ, ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు.!
Lavanya Tripathi Konidela Tollywood.. గ్లామర్ జోరు తగ్గేదే లే.!
పెళ్ళయ్యింది.. మెగా కోడలయ్యింది.! ఆ పెళ్ళి వేడుకలోనే, ఇదిగో ఇలా దర్శనమిచ్చింది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi).!
ఆ ఫొటోల్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా లావణ్య త్రిపాఠి షేర్ చేసింది.! ఇంకేముంది.? కొత్త పెళ్ళికూతురి లావణ్యం.. అందాల రాక్షసి లావణ్య తగ్గేదే లే.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయ్.
తొలి తెలుగు సినిమా ‘అందాల రాక్షసి’తోనే తెలుగు ప్రేక్షకుల దృష్టిలో ‘పదహారణాల తెలుగమ్మాయ్’ అయిపోయింది ఈ అందాల భామ.
నటన కొనసాగిస్తుందా.?
ఇంతకీ, లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తిరిగి సినిమాల్లో బిజీ అవుతుందా.? ఏం, ఎందుకు సినిమాల్లో నటించకూడదు.? సమంత కూడా పెళ్ళయ్యాక సినిమాల్లో నటించింది కదా.!
Also Read: చీ పాడు.! ఓటీటీ అంటే, అదొక్కటే కాదుగానీ.!
అలియా భట్, కైరా అద్వానీ, కాజల్ అగర్వాల్.. చెప్పుకుంటూ పోతే, పెళ్ళయ్యాక.. తల్లయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా వుంటోన్న తారలు చాలామందే వున్నారు.!
సో, లావణ్య కూడా సినిమాల్లోకి త్వరలోనే రీ-ఎంట్రీ ఇచ్చేయనుందన్నమాట.! ఆమెకేం తక్కువ.. అందానికి అందం.. నటనకు నటన.! అన్నిట్లోనూ మేటి.! అన్నట్టు, లావణ్య ఆల్రెడీ ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించిందండోయ్.!
అటు వెండితెర, ఇటు ఓటీటీ.. లావణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi Konidela) కోరుకుంటూ రెండూ సిద్ధమే.. ఆమెను ఆహ్వానించడానికి.!
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. బ్లాక్ డ్రెస్‌లో కొత్త పెళ్ళికూతురు అదుర్స్ కదూ.! అపురూప లావణ్యం.. అనిపించట్లేదూ.!
