Lavanya Tripathi Marriage.. అందాల రాక్షసికి పెళ్ళంట.! త్వరలో ఎంగేజ్మెంట్ జరగనుందట.! ఈ నెల 9వ తేదీన, అత్యంత సన్నిహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ జరుగుతుందట.
ఇంతకీ, లావణ్య త్రిపాఠిని (Lavanya Tripathi) పెళ్ళాడబోయేది ఎవరు.? ఇంకెవరు కొణిదెల వరుణ్ తేజ్ (Varun Tej Konidela( అట.
మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu konidela) తనయుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో గత కొంతకాలంగా ప్రేమలో వున్నాడంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Lavanya Tripathi Marriage.. లావణ్య – వరుణ్.. పెళ్ళెప్పుడు.?
ఇదిగో పులి.. అదిగో తోక.. ఇలా వుంది వ్యవహారం. లావణ్య – వరుణ్ తేజ్ (Lavanya Varun Tej) పెళ్ళి చేసేసుకున్నారనీ, కాపురం కూడా పెట్టేశారనీ.. ఆ మధ్య వార్తలొచ్చాయి.

ఔనా.? నా పెళ్ళి గురించి నాకైనా కాస్త చెప్పండి ప్లీజ్.! అంటూ లావణ్య సెటైర్లు కూడా వేసింది. వరుణ్ తేజ్ ఈ విషయమై పెద్దగా స్పందించిన దాఖలాల్లేవ్.
వరుణ్ (Konidela Varun Tej) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. లావణ్య కూడా ఒకటీ అరా సినిమాలు చేస్తోంది.
అప్పుడెప్పుడో మొదలైన ఊహాగానాలు..
‘మిస్టర్’ సినిమా సమయం నుంచీ లావణ్య (Lavanya) – వరుణ్ తేజ్‌ల (Varun Tej) మీద గాసిప్స్ వస్తూనే వున్నాయి. ఈ ఇద్దరూ కలిసి ‘అంతరిక్ష్యంలో’’ సినిమా కూడా చేశారు.
Also Read: Iswarya Menon: నిఖిల్ సిద్దార్ధ ఎంత మంచోడంటే.!
కలిసి సినిమాల్లో నటిస్తే.. ఎఫైర్ నడుపుతున్నట్టేనా.? పెళ్ళి పీటలెక్కేస్తారన్నట్టేనా.? ఏమో, అన్ని గాసిప్స్‌నీ ఉత్తగా కొట్టి పారేయలేం. అలాగని, పూర్తిగానూ నమ్మేయలేం.
లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi), కొణిదెల వరుణ్ తేజ్ (Varun Tej Konidela).. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ గాసిప్స్‌పై స్పందించాల్సి వుంది.
అన్నట్టు, వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక విషయంలో బోల్డన్ని పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుంటోందన్నదే ఆ పుకార్ల సారాంశం.
ఈ సమయంలో వరుణ్ పెళ్ళి గాసిప్స్ ఎందుకు వస్తున్నట్టో.!