Leena Manimekalai Kaali.. బీజేపీ నేత ఒకరు ఇస్లాం మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో, ఏకంగా ఇస్లామిక్ టెర్రరిస్టులు దేశంలో హత్యలకు తెగబడుతున్నారు.!
భారతదేశం గురించి ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.. దేశం మీద విరుచుకుపడుతున్నాయి.
ఓ వ్యక్తి, అధికార పార్టీ నేత అయినంతమాత్రాన, ఆ పార్టీ అధికార ప్రతినిథి అయినంతమాత్రాన.. ఆమె చేసిన వ్యాఖ్యల్ని దేశానికి ఆపదించడం ఎంతవరకు కరెక్ట్.. అన్న ఇంగితం ఎవరికీ లేకుండా పోయింది.
Leena Manimekalai Kaali.. కాళీ మాత పేరుతో పబ్లిసిటీ స్టంట్లు.!
ఇస్లాం మతంపై ఎవరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు.! నిజానికి, ఏ మతం మీదనైనా ఎవరైనా ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యాలి.? ఎవ్వరూ, ఏ మతాన్నీ కించపర్చకూడదు.
కానీ, భారతదేశంలో స్వేచ్ఛగా హిందూ మతంపై ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసెయ్యొచ్చు. జుగుప్సాకరంగా ప్రవర్తించొచ్చు.

‘ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తే, వాళ్ళని పట్టుకుని శిక్షిస్తామనడం మానేసి.. ‘ఏం, విరిగింది ఆంజనేయస్వామి బొమ్మ తాలూకు చెయ్యే కదా..’ అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేసే మంత్రులున్న రోజులివి.
ఇలాటి సమాజంలో, కాళీ మాత రూపాన్ని అపహాస్యం చేసేలా ఓ క్రియేటివ్ థాట్ వస్తే తప్పు పట్టడానికేముంటుంది.?
లీనా మణిమేకలై.. ఈవిడగారు, తాను తెరకెక్కిస్తోన్న ఓ డాక్యుమెంటరీ తాలూకు పోస్టర్ విడుదల చేశారు. అందులో కాళీ మాత రూపంలో ఓ మహిళ, ధూమపానం చేస్తోంది.
హిందూ మతంపై ఎందుకింత వెకిలితనం.?
దిగజారడంలో కొత్త లోతు ఇది. అసలు హిందువుల మీద ఇలా ఎందుకు పడి ఏడుస్తారు.? అన్నది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read: శునక యోగం.! రాజసం, వివాదం.! విమానయానం.!
క్రియేటివిటీ అనగానే, ముందుగా వచ్చే ఆలోచన హిందూ దేవుళ్ళను కించపర్చడం. అక్కడితోనే వీళ్ళ క్రియేటివిటీ మొదలవుతుంది.
ఔను మరి, ఇతర మతాల జోలికెళితే.. తలలు తెగిపడ్తాయ్.! అందుకే, అక్కడ భయం.. ఇక్కడేమో వెటకారం.!
నిజానికి, ఈ పైత్యం.. ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు.! ఎప్పటినుంచో వున్నదే. కాకపోతే, ఇప్పుడు అది మరింత నిర్లజ్జగా మారిందంతే.