Table of Contents
లైగర్.. అనగానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబో సినిమా ‘లైగర్’ గుర్తుకురావడం సహజమే. కానీ, ఇక్కడ విషయం సినిమాకి సంబంధించింది కాదు. అసలు లైగర్ (Liger and Tigon A Big Mystery) అంటే ఏంటి.? లైగర్ కథా కమామిషు ఏంటి.? ఆ సంగతులేంటో తెలుసుకుందామా.!
లైగర్ (Liger) అనేది ఓ జంతువు. సాధారణ జంతువు కాదు, చాలా ప్రత్యేకమైనది. ఒకే జంతువులో రెండు లక్షణాలుంటాయి. ఇది పిల్లి జాతికి చెందిన జంతువుల్లోనే అతి పెద్దది. తొమ్మిది నుంచి దాదాపు 12 అడుగుల పొడవు వరకు ఇవి పెరిగే అవకాశం వుంది. బరువు విషయానికొస్తే, 300 కిలోల నుంచి 520 కిలోల వరకు తూగుతాయి.
అసలు లైగర్ అంటే ఏంటి.?
సింహం (లయన్), పులి (టైగర్) కలయిక ద్వారా పుట్టిన జంతువే లైగర్. అయితే, ఇక్కడ మగ సింహం, ఆడ పులి సంగమం ద్వారా జన్మించే జీవికి లైగర్ అని పేరు పెడతారు. ఇందులో మళ్ళీ ఆడ, మగ వుంటాయి. చిత్రమేంటంటే, మగ లైగర్ ఇంకో ఆడ లైగర్‌నిగాని, మరే జంతువుతోగానీ, సంభోగం జరిపి, పిల్లలకు తండ్రి అయ్యే అవకాశం కలిగి వుండదు. ఆడ లైగర్ మాత్రం, మగ సింహం లేదా మగ టైగర్‌తో సంభోగం చేసి పిల్లల్ని కనగలదు.

లైగర్ సరే, టైగోన్ మాటేమిటి.? Liger and Tigon
మగ సింహం, ఆడ పులి కలిస్తే లైగర్ అంటున్నాం. అలాగే, మగ పులితో ఆడ సింహం కలిస్తే దాన్ని టైగోన్ అంటాం. అయితే, లైగర్ కంటే టైగోన్ కాస్త చిన్నదిగా వుంటుంది. ఇందులోనూ సేమ్ ఈక్వేషన్. మగ టైగోన్లు పునరుత్పత్తికి పనికిరావు. ఆడ టైగోన్లకు పునరుత్పత్తి చేయగల అవకాశం వుంటుంది.
లైగర్, టైగోన్.. ఎప్పటినుంచి.?
లైగర్లు, టైగోన్ల గురించి భిన్న వాదనలున్నాయి. అవి ఎప్పటినుంచి భూమ్మీద వున్నాయన్నదానిపై రకరకాల వాదనలు వినిపిస్తాయి. భారతదేశంలోనే 1850 నుంచి 1890 మధ్యలో లైగర్ల (Liger and Tigon A Big Mystery) ప్రస్తావన వుందనడానికి కొన్ని ఆధారాలున్నాయి.
Also Read: అంగారకుడిపై క్రికెట్.. ఇలా ఆడేస్తే సరి.!
ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య సుమారు 10కి పైగానే వుందన్నీ, అయితే వీటిని ప్రత్యేకంగా పెంచుతారు తప్ప, వీటికి అడవుల్లో తమంత తాము జీవించగలిగే శక్తి లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.