చంద్రబాబుకి విడుదల ఎప్పుడు.?

Nara Chandrababu Naidu

Chandrababu In Jail.. ఇదిగో విడుదల.. అదిగో విడుదల.. ఈ ప్రచారాలు తప్ప, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి ‘విడుదల’ దొరకడంలేదు.!

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు.

అసలు అరెస్టు వరకూ వెళ్ళదనుకున్నారు.. అరెస్టు జరిగిపోయింది.! రిమాండ్ వరకూ వెళ్ళదనుకున్నారు.. ఆ రిమాండూ తప్పలేదు.

ఇప్పుడు వ్యవహారం కస్టడీ వరకూ వచ్చింది. తర్వాత ఏమవుతుందో.! ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళ ఆవేదన.

Chandrababu In Jail.. ఖర్చు దండగ వ్యవహారం..

బోల్డంత ఖర్చు చేసి ఖరీదైన లాయర్లను తీసుకొస్తున్నారుగానీ ప్రయోజనం కనిపించడంలేదు.

సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూద్రా, సోషల్ మీడియాలో ట్వీట్లేస్తున్నారు తప్ప, ఆయన వల్ల ప్రయోజనం శూన్యం.

జరుగుతున్న పరిణామాల్ని చూస్తోంటే, చంద్రబాబు ఈ కేసులో పీకల్లోతు కూరుకుపోయినట్లే కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతానికి ఆయన నిందితుడు మాత్రమే.

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసునే తీసుకుంటే, ఏళ్ళ తరబడి నడుస్తోంది కేసు. సుదీర్ఘ కాలంగా ఆయన బెయిల్ మీదనే వున్నారు.

Also Read: పాచిపోయిన వార్త.! చిరంజీవి సరసన అనుష్క.!

ముందు ముందు చంద్రబాబు (Nara Chandrababu Naidu) పరిస్థితి కూడా అంతేనా.? సుదీర్ఘ కాలం ఆయన బెయిల్ మీదనే వుండాల్సి వస్తుందా.?

అంతేనేమో.. దేశంలోని దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ తీరు.. అలాగే వుందన్న చర్చ సాధారణ ప్రజానీకంలో జరుగుతోంది.

hellomudra

Related post