Liger Review.. సినిమాల్ని ఇలాక్కూడా తీయొచ్చా.? ఔను, భలే భలే సినిమాలు తీసిన పూరి జగన్నాథ్, భయపెట్టే సినిమాలు తీయడం మొదలు పెట్టి చాలాకాలమే అయ్యింది.
మధ్యలో ‘ఇస్మార్ట్ శంకర్’ ఏదో ‘సుడి’ వల్ల హిట్టయ్యిందిగానీ, లేకపోతే పూరి జగన్నాథ్ నుంచి మంచి సినిమాని చూసి ఆయన అభిమానులకు ఎన్నాళ్ళయ్యుండాలి.?
విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడు. ఒకే ఒక్కడు, ఔను ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డది ఆయనొక్కడే అని సినిమా చూస్తే అర్థమవుతుంది.
కానీ, తెరవెనుక చాలామంది కష్టపడ్డారు. వాళ్ళందరి కష్టాన్ని పూరి జగన్నాథ్ ఒక్కడే వృధా చేశాడా.? కాస్త మనసు పెట్టి కథ రాసివుంటే, ‘లైగర్’ నిజంగానే పెద్ద హిట్ అయి వుండేది. అంతలా అన్నీ సమకూరాయి ఈ సినిమాకి.
Liger Review.. పూరి జగన్నాథ్‌కి ఏమయ్యిందబ్బా.?
ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు.. ఖర్చు బాగానే పెట్టారు కదా.? సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు.. మరీ అంత నాసిరకంగా ఏమీ లేవు కదా.?
అసలు పూరి జగన్నాథ్‌కి ఏమయ్యింది.? కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే, పూరి సినిమా కోసం హీరోలు చాలా చాలా కష్టపడతారు. వాళ్ళ కష్టాన్ని వృధా చేయడమే పనిగా పెట్టుకుంటున్నాడు పూరి.

నిజానికి, నలభై నిమిషాలకే సినిమా అయిపోయింది. హీరోయిన్ సోదరుడితో ఫైట్ అయిపోగానే, నేషనల్ ఛాంపియన్ అనగానే అక్కడితో, ఓటీటీలో చూస్తున్నవారు ఎగ్జిట్ కొట్టేస్తారు. ఆ తర్వాత ఏమీ వుండకపోవచ్చని.
అసలు సిసలు టార్చర్ అక్కడి నుంచే మొదలైంది. థియేటర్లలో చూసినోళ్ళెవరూ ‘లైగర్’ని ఓటీటీలో చూసే సాహసం చెయ్యరు. ఒకవేళ చేసినా, అక్కడే ‘లైగర్’ నేషనల్ ఛాంపియన్ అయిపోగానే ఆపేస్తారు.
పూరి జగన్నాథ్ ఖేల్ ఖతం.!
సినిమా పూర్తిగా చూశారో, చచ్చారే.! అలా జనాన్ని భయపెట్టేందుకే పూరి సినిమాని అంతలా సాగదీసినట్టున్నాడు.!
బాబోయ్ ఇదేం సినిమా.? అనుకోకుండా వుండలేం ‘లైగర్’ సినిమా పూర్తిగా చూస్తే మాత్రం.! సినిమాతో ఏం చెప్పాలనుకున్నాడు.? జనానికి పూరి ఏం చూపించాలనుకున్నాడు.?
Also Read: జస్ట్ ఆస్కింగ్.! ఆ అవార్డుకి పూజా హెగ్దే అర్హురాలేనా.?
కథని చాలా నేర్పుగా చెప్పగలడు పూరి. తెరపై హీరోయిజం పీక్స్‌లో చూపించగలడు. కానీ, ఆ మ్యాజిక్ ఇప్పుడు ఆయనలో లేదు. ఇకపై మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ప్రేక్షకులకు వెన్నుపోటు పొడిచావ్ పూరీ.!
ఇంతకీ సినిమాలో హీరోయిన్ ఎందుకు వున్నట్టు.? సినిమా చూశాక చాలామందికి వచ్చే డౌట్ ఇదే.

చివరగా.. థియేటర్లకు వెళ్ళి సినిమా చూసినోళ్ళ పట్ల కాస్తంత జాలి చూపించాల్సిందే.
ఎందుకంటే, ఓటీటీలో నాలుగైదు సార్లు సినిమాని స్కిప్ చేసి, చాలాసార్లు ఫాస్ట్ ఫార్వార్డ్ కొట్టేసి.. ఎలాగోలా ఫినిష్ చేయాల్సి వచ్చింది మరి. థియేటర్లలో ఆ అవకాశం వుండదు కదా.!