Table of Contents
కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు.. సోనూ సూద్ గొప్పగా చేసేస్తున్నాడు.. మెగాస్టార్ చిరంజీవి (Like Sonu Sood Like Chiranjeevi Big Stars Beautiful Hearts) తన ఇంట్లో చేపల పులుసు వండుతున్నాడు.. అంటూ వెటకారాలు చేయడం చాలా చాలా తేలిక. ఇక్కడ సోనూ సూద్ గొప్పతనం గురించి ఇంకా గొప్పగా చెప్పే ఉద్దేశ్యం సోకాల్డ్ మేధావులకి వుందని అనుకోలేం. ఎలాగోలా చిరంజీవి వ్యక్తిత్వాన్ని డీగ్రేడ్ చేయడమే సదరు మేధావుల లక్ష్యం.
సోకాల్డ్ మేధావుల పిచ్చి కాకపోతే, ఒకడు తగ్గిస్తే తగ్గిపోయే స్థాయి చిరంజీవిదా.? మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరిది. తెరపై హీరోయిజం మాత్రమే కాదు.. నిజ జీవితంలోనూ చిరంజీవి హీరోయిజం ఏంటో చాలా చాలా సందర్భాల్లో అందరూ చూశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్.. సినీ పరిశ్రమలో ఎవరూ ఈ స్థాయిలో ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు. చిరంజీవి అది చేసి చూపించారు.
రక్తదానం.. నేత్రదానం.. ఇదీ చిరంజీవితం..
రక్తదానం చేయండి.. నేత్రదానం చేయండి.. అని పిలుపునివ్వడం ద్వారా చిరంజీవి ఎన్ని లక్షల మందిని ఆదుకున్నారో, ఆ బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ద్వారా లబ్ది పొందినవారికే (Like Sonu Sood Like Mega Star The Big Stars Have Beautiful Hearts) తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకొకటి చొప్పున ఆక్సిజన్ బ్యాంకుల్ని పెట్టాలని మెగాస్టార్ చిరంజీవి నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి చిరంజీవి మాత్రమే కాదు, మన సినీ నటుల్లో చాలామంది నిజ జీవితంలోనూ హీరోలే. ఆ హీరో ఈ హీరో అన్న తేడాల్లేవ్.. తెలుగు సినీ కళామతల్లి బిడ్డలంతా, తమను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులనే ప్రజల్ని ఎప్పటికీ మర్చిపోరు. కేవలం డబ్బుతోనే పనులన్నీ అయిపోవు. వందలాదిమందిని.. వేలాదిమందిని.. లక్షలాదిమందిని కదిలించే శక్తి సినీ నటులకుంది.. సినీ నటులు, వారి అభిమానులు చేస్తున్న ‘సేవ’ కరోనా వేళ, బాధితులకు ఎంతో ఊరట కలిగిస్తోంది.
తుపాను వస్తే ఆదుకుంటారు.. ఇంకేదన్నా కష్టమొస్తే చేతనైనంత సాయం చేస్తారు. క్యాన్సర్ వ్యాధితో అభిమానులు బాధపడుతున్నారంటే సాయపడతారు.. ఇంకేదన్నా సమస్య వస్తే, తామున్నామంటూ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తారు. సినీ నటులైనా వాళ్ళూ మనుషులే. వాళ్ళకీ కొన్ని పరిమితులంటాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినీ పరిశ్రమల్లో.. సినీ ప్రముఖులంతా తమకు తోచిన రీతిలో ఇతరులకు సాయమందిస్తున్నారు.. తమ కుటుంబ సభ్యుల్ని కరోనా కారణంగా కోల్పోతున్నవారూ.. ఇతరులకు సాయం చేయడంలో పెద్ద మనసు చాటుకుంటుండడం ప్రశంసనీయం.
తమ కష్టం పైకి కనపడనీయకుండా సాయమందిస్తున్న సినీ పరిశ్రమ..
కరోనా.. సినీ రంగాన్ని కూడా సర్వనాశనం చేసింది. నిర్మాతల కష్టాలు, దర్శకులు, నటీనటుల కష్టాలు, టెక్నీషియన్ల కష్టాలు, జూనియర్ ఆర్టిస్టుల సమస్యలు.. చెప్పుకుంటూ పోతే లెక్కలేనని ఇబ్బందులు. వాటన్నిటినీ సినీ పరిశ్రమ అంతర్గతంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. దాంతోపాటుగా, సమాజానికి వీలైనంత వరకు సాయం చేసేందుకు (Like Sonu Sood Like Chiranjeevi Big Stars Beautiful Hearts) ముందుకొస్తోంది.
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ సోషల్ మీడియా వేదికగా ఎవరు సాయం కోరినా వెంటనే స్పందిస్తున్నాడు. ధన సాయం చేస్తున్నాడు.. ఆసుపత్రుల్లో బెడ్స్ అందేలా చూస్తున్నాడు.. అవసరమైన మందుల్ని అందించేందుకు కష్టపడుతున్నాడు. నిర్మాణ సంస్థలు, దర్శకులు, నటీనటులు.. చాలామంది ఇదే పనిలో క్షణం తీరిక లేకుండా కరోనా బాధితుల్ని ఆదుకుంటున్నారు. బాధిత కుటుంబాల్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాజకీయ నాయకులేం చేస్తున్నారు.?
సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వాలకి పెద్దయెత్తున విరాళాలు వెళుతున్నాయి. ఏం, ఎన్నికల వేళ ఓటు కోసం కరెన్సీ నోట్లు పంచే రాజకీయ నాయకులు.. ఇప్పుడెందుకు విరాళాలు ఇవ్వరు.? సోకాల్డ్ మేధావులు ఏనాడైనా ప్రశ్నించారా.?
అధికారంలో వున్నోళ్ళు, ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేస్తారు తప్ప.. తమ సొంత వ్యాపారాల నుంచి ఎందుకు విరాళాలు ఇచ్చి ప్రజల్ని ఆదుకోరు.? సినీ పరిశ్రమ మీద పడి ఏడ్చేవాళ్ళెవరైనా.. ముందు రాజకీయ నాయకుల్ని ప్రశ్నించగలగాలి. అంత సీన్ వాళ్ళకుంటుందా.? ఛాన్సే లేదు.