Lisa Artificial Intelligence Anchor.. ఆమె పేరు లీసా.! యాంకర్ అనండీ.. న్యూస్ రీడర్ అనండీ.! ఇంతకీ ఎవరామె.? ఆమె మనిషి కాదు.! మరమనిషి అసలే కాదు.!
కనిపిస్తుంది.. మాట్లాడుతుంది.. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంది (Lisa AI Anchor). ప్చ్.. టచ్ చేయడం కుదరదు.!
ఎందుకంటే, ఆమెకు ఫిజికల్‌గా రూపం లేదు. జస్ట్, ఇమాజినేషన్.. ఇమేజ్ కనిపిస్తుందంతే.! ఇదేం వింత.?
Lisa Artificial Intelligence Anchor.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్..
ఈ యాంకర్ లిసా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేస్తుంది. ఎవరన్నా ప్రశ్నలడిగితే సమాధానాలూ చెప్పగలదు.
చకచకా వార్తలు చదివేయగలదు. అందమైన రూపం.! ముచ్చటైన ముఖ కవళికలు.! వారెవ్వా.. నిజంగా ఏ మనిషీ ఇంత అందంగా వుండదేమో.. అనిపిస్తుంది.
ట్రెండ్ మారింది.! రోబోల గురించి మాట్లాడుకునే రోజులు కూడా పోతున్నాయ్. కొత్తగా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. భవిష్యత్తు అంతా అదే.!
మరణం లేనిది.!
ఔను, ఈ సృష్టిలో అన్నిటికీ ఎక్స్‌పైరీ డేట్ వుంటుంది. కానీ, లీసాకి (Lisa AI Anchor) అది వుండదు. ఎందుకంటే, లీసాకి జీవం లేదు.
మరబొమ్మలూ కొన్నాళ్ళ తర్వాత పని చేయడం మానేస్తాయ్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారైన బొమ్మకి మరణమెలా వుంటుంది.?
Also Read: టైటానిక్ విషాదం! ఐదుగుర్ని మింగేసిన ఓసియన్ గేట్ ‘టైటాన్’!
ముందు ముందు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) చూడబోతున్నాం.
విద్యా రంగంలో అయితే, ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) పెనుమార్పులు తీసుకొచ్చే అవకాశం వుంది.
అంతా బాగానే వుందిగానీ.. మీడియా అంటేనే మాఫియాగా మారిపోయిన ఈ రోజుల్లో.. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత న్యూస్ రీడర్ లేదా యాంకర్.. చెప్పే వార్తలు నిజాలేనా.? అమ్ముడుపోయే వార్తలా.?
మామూలుగా అయితే మనుషులకి ఇంగితం వుంటుంది.. ఇప్పుడేమో అది కొరవడింది. సో, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడింగ్ విషయంలో అద్భుతాల్ని ఆశించలేం.
జస్ట్ మాట్లాడుకోవడానికి ఇదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంతే.! ఎనీ డౌట్స్.?