Table of Contents
అసలు డేటింగ్ అంటే ఏంటి.? దాన్నొక బూతుగా భావించేటోళ్ళు చాలామందే వున్నారు. కాదు కాదు, అది చాలా ముఖ్యం.. అనే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. ‘పెళ్ళికి ముందు డేటింగ్ చేయకపోతే అసలు మనిషే కాదన్నట్టు..’ అన్న అభిప్రాయం (Love Dating and Live In Relationship) నేటి యువతలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
ఓ అందాల భామ, తాను చాలామందితో డేటింగులు చేసేశాననీ, అయితే అవన్నీ తక్కువ వ్యవధి డేటింగులేననీ, ఎక్కువ వ్యవధి డేటింగ్ కోసం ప్రయత్నిస్తున్నానని సెలవిచ్చి అందరికీ పెద్ద షాకే ఇచ్చింది.
Also Read: చింపేస్తాం.. పోగులే ధరిస్తాం.. అంతా మా ఇష్టం.!
ఇదేం పాడు ఆలోచన.? అని ఎవరైనా ముక్కున వేలేసుకోవచ్చుగాక. పెళ్ళితో పనేమీ లేకుండానే సహజీవనం చేస్తున్న రోజులివి. అదేదో నేరమో, పాపమో కాదని తీర్పులు కూడా వచ్చేశాయ్. దాంతో, సహజీవనాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయ్.
పద్ధతిగా జరిగిన పెళ్ళిళ్ళన్నీ నిలబడిపోతున్నాయా.?
పద్ధతిగా పెళ్ళి చేస్తే మాత్రం, ఆ కాపురాలు వందేళ్ళు వర్ధిల్లుతున్నయా.? అంటే, అందులోనూ కొన్ని అయితే నెలలు తిరగకుండానే పెటాకులైపోతున్నాయి. పెళ్ళయిన కొద్ది రోజులకే కాపురాలు కూలిపోయిన సంఘటనల్ని నిత్యం చూస్తున్నాం. ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నవారికీ ఈ బాధ తప్పడంలేదు.
ఏది మంచిది.? ఏది చెడ్డది.? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఈరోజుల్లో కష్టం. ఎవరి వ్యక్తిగత ఇష్టాలు వారివి. ఆ ఇష్టాలు వారి వారి జీవిత భాగస్వాములకు నచ్చకపోతే అంతే సంగతులు.
Also Read: మాల్దీవుల్లో అందాల మంట పెట్టేస్తున్నారహో
అందుకే, నచ్చినంత కాలం కలిసి జీవించడం. నచ్చకపోతే విడిపోవడం (Love Dating and Live In Relationship). ఎక్కువ రోజులు కలిసి వుంటే ఓ రికార్డు.. తక్కువ రోజులకే విడిపోతే అది ఇంకో రికార్డు. మళ్ళీ రెండిటికీ సెపరేటుగా సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇంకో ట్రెండు.
డేటింగురంగా.. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం
సరే, ఒకరితో డేటింగు చేసి, అది కుదరక ఇంకొకరితో డేటింగు మొదలెడితే దాన్ని పూర్తిగా తప్పు పట్టేయాల్సిన పనిలేదు.
చాలామందితో డేటింగులు చేసేశా.. సరైనోడు దొరకలేదు, దొరికితే ఎక్కువకాలం డేటింగు చేసి, ఆ తర్వాత కూడా కలిసే వుండగలమనే నిర్ణయానికి ఇద్దరం వస్తే అప్పుడు పెళ్ళి చేసేసుకుంటామని నటి నియా శర్మ సెలవిచ్చింది. అంటే షార్ట్ టెర్మ్.. లాంగ్ టెర్మ్.. అనగా పొట్టి, పొడుగు కోర్సుల్లాగన్నమాట.
Also Read: ఫిట్ అండ్ పెర్‌ఫెక్ట్: విల్లులా వంచేస్తే సరి.!
ఇలాంటోళ్ళు బహుశా చాలామందే వుంటారండోయ్. ముందే చెప్పుకున్నాం కదా, దేన్నీ పూర్తిగా తప్పు పట్టేయలేని మాయాదరి కాలమిది.