మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ‘రచ్చ’ షురూ అయ్యింది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, ‘మా’ (Maa Movie Artists Association Elections) అధ్యక్ష పదవికి పోటీ పడుతుండడంతో ‘లోకల్ వర్సెస్ నాన్ లోకల్’ అంశం తెరపైకొచ్చింది. ఎవరు ‘మా’ అధ్యక్ష పీఠమెక్కితే ఏం లాభం.? అన్న చర్చ సినీ పరిశ్రమలో వుండనే వుంది.. కారణం, ‘మా’ కిరీటం ఎవరికి దక్కినా.. దానికి వున్న పవర్ చాలా చాలా తక్కువ కావడమే.
వెయ్యి మంది కూడా ఓటర్లు లేని ‘మా’ ఎన్నికలపై మీడియా ‘అతి’ ఫోకస్ పెట్టడం తప్ప, అందులో ఏం జరిగితే.. ఎవరిక్కావాలి.? అన్న అభిప్రాయం చాలామందిలో వుంది. సరే, సినీ వార్తలకి వున్న క్రేజ్ సామాన్యుల్లో అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో సినీ జనాలు ఏ కామెంట్ చేసినా, దానికి మీడియాలో వచ్చే ప్రచారం కారణంగా.. ఆ టాపిక్ మీద రచ్చ మరింత ఎక్కువగా జరుగుతుంటుంది.
Also Read: జస్ట్ ఆస్కింగ్: పవన్‌పై ప్రకాష్‌రాజ్‌కి ఈ ద్వేషమేల?
గతంలో జరిగిన పలు ఎన్నికలు ఇదే విషయాన్ని నిరూపించాయి. కానీ, చివరికి.. అంటే ఎన్నికలయ్యాక.. అక్కడేమీ వుండదు. అంటే, అంతా చల్లబడిపోతుందని.. అందరూ సర్దుకుపోతారనీ. అప్పుడప్పుడూ చిన్నా చితకా గొడవలు రావడం, ఆ తర్వాత సద్దుమణిగిపోవడం అంతా మామూలే.
చిరంజీవి ఎవరికో మద్దతిచ్చారట.. బాలకృష్ణ ఇంకెవరికో అండగా నిలిచారట.. ఇలాంటి ప్రచారాలన్నీ ‘మా’ ఎన్నికలకు అనవసరపు హైప్ ఇచ్చి, మీడియా చేసే పబ్లిసిటీ స్టంట్ తప్ప ఇంకేమీ వుండదు. అందరూ సినీ కళామతల్లి బిడ్డలే. హాలీవుడ్ నుంచి టెక్నీషియన్లనీ, నటీనటుల్నీ తెలుగు సినిమా కోసం తీసుకొస్తున్నాం.
అలాంటప్పుడు లోకల్.. నాన్ లోకల్.. అన్న చర్చ ఎలా వస్తుంది ‘మా’ ఎన్నికల విషయంలో అయినా, మరో విషయంలో అయినా. మన ప్రభాస్, పాన్ ఇండియా స్టార్.. అంటున్నాం. మన అల్లు అర్జున్, ‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయ్యే విజయం సాధించాలని ఆశిస్తున్నాం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, నాన్ లోకల్ అంశం.. జస్ట్ ఓ అర్థం పర్థం లేని వ్యవహారం అంతే.
Also Read: రీల్ & రియల్ హీరోయిజం.. Mega ఆపన్నహస్తం.?
‘మా’ ఎన్నికలయ్యాక.. గెలిచినోళ్ళు సినీ పరిశ్రమకి కావొచ్చు, ‘మా’ కుటుంబానికి కావొచ్చు.. ఏం చేస్తారు.? ప్రతిసారీ తెరపైకొచ్చే ప్రశ్నే. గత ఎన్నికల సమయంలో నానా రచ్చా జరిగింది.. అంతకు ముందూ అదే చూశాం. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ.. ఈ రచ్చ సినీ పరిశ్రమ మీద పెద్ద మచ్చ వేసి పోతోంది. దాన్ని చెరుపుకోవడం సినీ పరిశ్రమకు (Maa Movie Artists Association Elections) కష్టమవుతోంది. సినీ పరిశ్రమ పెద్దలంతా ఒక్కచోట కూర్చుని ‘లోపాన్ని’ సరిద్దాల్సిన సమయమిదే.